షేక్‌హ్యాండ్స్ ఇవ్వాల్సిన చేతులే.. చైర్స్ ఎత్తాయి! అభిమానుల రక్తం మరిగింది..!
ఎగ్జాక్ట్‌గా మెస్సీ షెడ్యూల్ ఏంటి? ఏం జరిగింది? శనివారం తెల్లవారుజామున రెండున్నరకు కోల్‌కతాలో ల్యాండ్ అయ్యాడు మెస్సీ. సాల్ట్ టేక్ స్టేడియానికి రావడానికి ముందు ఉదయం పదకొండున్నరకు.. 70 అడుగుల తన విగ్రహాన్ని తనే ఆవిష్కరించుకున్నాడు. అది కూడా వర్చువల్‌గా. అంత సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదని లేక్‌టౌన్ నుంచే వర్చువల్‌గా విగ్రహావిష్కరణ జరిగింది. నెక్ట్స్ ప్రోగ్రామ్.. లేక్‌టౌన్ నుంచి సాల్ట్ లేక్ స్టేడియానికి వెళ్లడం. అప్పటికే కొన్ని వేల మంది ఫ్యాన్స్ కొన్ని గంటలుగా ఎదురు చూస్తున్నారు. మెస్సీ స్టేడియానికి రానే వచ్చాడు. బట్.. ఏం లాభం. వీవీఐపీలు చుట్టుముట్టేశారు. ఎంతకీ తమ అభిమాన ఆటగాన్ని చూపించరే! అప్పటికే ఆవేశం, ఆగ్రహం తన్నుకొస్తూనే ఉంది. అభిమానులు అదుపు తప్పొచ్చన్న సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి.

డామిట్.. కథ అడ్డం తిరిగింది. అభిమానంలో, ఆరాదనలో ఓ ‘పిచ్చి’ ఉంటుంది. దాన్ని బయటకు తీశారు. లేదు.. బయటకు తీసేలా చేశారు. లేకపోతే… మెస్సీ వస్తున్నాడు కదా అని, ఏం చేస్తే తమ అభిమానం అతడికి అర్థమవుతుందా అని ఆలోచించి, జస్ట్ 40 డేస్‌లోనే విగ్రహం కట్టేశారు. తమ అభిమానాన్ని చాటుకునేందుకు 70 అడుగులు విగ్రహాన్ని నిలబెడితే.. ఇలానా నిరాశపరిచేది..! పట్టుమని పది నిమిషాలు కూడా మెస్సీని అభిమానుల ముందు నిలబెట్టలేకపోయారు ఆర్గనైజర్స్. అలా చేస్తే ఒళ్లుమండిపోదా మరి. అదేం చిన్న ఈవెంట్ కాదు. ప్రపంచంలో అంత పెద్ద విగ్రహం మెస్సీకి ఎక్కడా లేదు. అదీ మెస్సీ పట్ల కోల్‌కతా ఫ్యాన్స్‌కున్న అభిమానం. కాదు…! మెస్సీ అనే కాదు. ఫుట్‌బాల్ ఆటపై బెంగాల్ కుర్రాళ్లకు ఉన్న క్రేజ్ అది. జనరేషన్స్ మారుతున్నా సరే.. బెంగాల్‌లో ఫుట్‌బాల్‌పై అభిమానం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అంత పిచ్చి… ఫుట్‌బాల్ అన్నా, ఫుట్‌బాల్ స్టార్స్ అన్నా. ఆ పల్స్‌ను పట్టుకోలేకపోయారు నిర్వాహకులు, అధికారులు. అసలు.. బెంగాల్‌లో ఆటలపై ఎంత పిచ్చి ఉంటుందో చూపించే ఘటనలు చాలా ఉన్నాయి. అయితే అభిమానంతో ఆకాశానికి ఎత్తేస్తారు, తేడా వస్తే తగలబెట్టేస్తారు. రెండూ కాస్త అతిగానే చూపిస్తారు. అలా జరిగిన అనుభవాలున్నాయి. అయినా సరే, ఏమాత్రం ముందు జాగ్రత్త తీసుకోలేదంటే ఏమనుకోవాలి? దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఉండడం వేరు, కోల్‌కతాలో ఉండడం వేరు. అది గమనించకపోవడం వల్లే ఇలా జరిగిందా?...




