శబరిమల సన్నిధానం వద్ద ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు సహా 9మందికి సీరియస్..!
కేరళలోని శబరిమల సన్నిధానం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భక్తుల గుంపులోకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శనివారం (డిసెంబర్ 13) సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

కేరళలోని శబరిమల సన్నిధానం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భక్తుల గుంపులోకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శనివారం (డిసెంబర్ 13) సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
గాయపడిన వారిలో నలుగురు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారుగా గుర్తించారు. ఇద్దరు తమిళనాడుకు చెందినవారు కాగా, మిగతా ముగ్గురు కేరళకు చెందినవారుగా గుర్తించారు. గాయపడిన వారిని వీరారెడ్డి (30), నితీష్ రెడ్డి (26), దృవంశ్ రెడ్డి (10), సునీత (65), తులసమ్మ (60) గా గుర్తించారు.
చెత్తను రవాణా చేయడానికి ఉపయోగించే ట్రాక్టర్ ప్రమాదావశాత్తు జనంపైకి దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. భారీ వర్షం కారణంగా వాహనం నిటారుగా ఉన్న రోడ్డుపై నియంత్రణ కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ సంఘటనలో సన్నిధానం పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి..




