RRB Job Calendar 2026: నిరుద్యోగులకు అలర్ట్.. RRB 2026 జాబ్ క్యాలండర్ విడుదల! పూర్తి షెడ్యూల్ ఇదే
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 2026 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలండర్‌ను తాజాగా విడుదల చేసింది. తాజా జాబ్ క్యాలండర్ ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకోపైలట్, మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్‌లో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు..

హైదరాబాద్, డిసెంబర్ 14: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 2026 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలండర్‌ను తాజాగా విడుదల చేసింది. తాజా జాబ్ క్యాలండర్ ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకోపైలట్, మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్‌లో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. జులైలో పారామెడికల్, జేఈ ఉద్యోగాలు, ఆగస్టులో ఎన్టీపీసి, సెప్టెంబర్‌లో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్‌లో గ్రూప్-డీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రానున్నాయి.
ఆర్ఆర్‌బీ 2026 జాబ్ క్యాలండర్ ఇదే..
- ఫిబ్రవరి 2026లో – అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్
- మార్చి 2026లో- టెక్నీషియన్, సెక్టార్ కంట్రోల్ పోస్టులకు నోటిఫికేషన్
- ఏప్రిల్ 2026లో – సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు నోటిఫికేషన్
- జూలై 2026లో – పారామెడికల్ స్టాఫ్‌తో పాటు జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టులకు నోటిఫికేషన్
- ఆగస్టు 2026లో – నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ పోస్టులకు నోటిఫికేషన్
- సెప్టెంబర్ 2026లో – మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్
- అక్టోబర్ 2026లో – లెవల్ 1 గ్రూప్-డీ పోస్టులకు నోటిఫికేషన్
కాగా ఆర్‌ఆర్‌బీ ప్రతీయేట ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ల వివరాలతో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. క్యాలెండర్‌లో పేర్కొన్న విధంగా ఎప్పటికప్పుడు ఆర్‌ఆర్‌బీ ఆయా నోటిఫికేషన్లను జారీ చేస్తుంది. ఇలా రైల్వే బోర్డు క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించడం వల్ల అభ్యర్థులకు తమ ప్రిపరేషన్‌ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించుకునే వెసులుబాటు ఉంటుంది. గతంలో నోటిఫికేషన్ల మధ్య అనిశ్చితి ఉండేది. కానీ ఇటీవల రాలంలో రైల్వే బోర్డు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టత ఇవ్వడంతో అభ్యర్థుల ప్రిపరేషన్ పక్కాగా సాగించే వెసులుబాటు కలిగింది. కాగా సాధారణంగా రైల్వే పరీక్షల్లో జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి.. వీటిపై ఇప్పటి నుంచే గట్టి పట్టు సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








