AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఈ సమస్యలుంటే బీట్‌రూట్‌కు దూరంగా ఉండటమే బెటర్.. లేకపోతే..

బీట్‌రూట్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, ఖనిజాలు దాగున్నాయి.. అందుకే.. దీనిని సూపర్‌ ఫుడ్‌గా పేర్కొంటారు.. బీట్‌రూట్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనత లేదా రక్త లోపం ఉన్న సందర్భాల్లో, వైద్యులు దీనిని ఆహారంలో చేర్చుకోవాలని సిఫార్సు చేస్తారు.

వామ్మో.. ఈ సమస్యలుంటే బీట్‌రూట్‌కు దూరంగా ఉండటమే బెటర్.. లేకపోతే..
Beetroot Benefits
Shaik Madar Saheb
|

Updated on: Sep 03, 2025 | 4:44 PM

Share

బీట్‌రూట్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, ఖనిజాలు దాగున్నాయి.. అందుకే.. దీనిని సూపర్‌ ఫుడ్‌గా పేర్కొంటారు.. బీట్‌రూట్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనత లేదా రక్త లోపం ఉన్న సందర్భాల్లో, వైద్యులు దీనిని ఆహారంలో చేర్చుకోవాలని సిఫార్సు చేస్తారు. బీట్‌రూట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తపోటును నియంత్రించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా దీనిలోని పోషకాలు.. రక్తహీనతను తగ్గించడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇంకా బీట్‌రూట్ రసం ఒక అద్భుతమైన శరీర నిర్విషీకరణలా పనిచేస్తుంది. అయితే, ఈ లక్షణాలన్నీ ఉన్నప్పటికీ, ఈ సూపర్ ఫుడ్ కొంతమందికి హాని కూడా కలిగిస్తుందంటున్నారు డైటీషీయన్లు.. ఏ వ్యక్తులు బీట్‌రూట్ ను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

బీట్‌రూట్‌ను ఎలాంటి వారు తినకూడదు..

మూత్రపిండాల్లో రాళ్లు: బీట్‌రూట్ ఫోలేట్, మాంగనీస్ వంటి పోషకాలకు గొప్ప మూలం. ఇందులో ఆక్సలేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది. ముఖ్యంగా మీరు మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడుతుంటే.. పొరపాటున కూడా దీనిని తినకండి.

అధిక రక్తపోటును తగ్గిస్తుంది: బీట్‌రూట్ రసం తాగడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. ఎందుకంటే బీట్‌రూట్‌లో నైట్రేట్ ఉంటుంది. నైట్రేట్లు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతాయి. కానీ మీకు తక్కువ రక్తపోటు సమస్య ఉంటే దీనిని తీసుకోవద్దు.. తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్) ఉన్నవారు తింటే.. పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది.

డయాబెటిస్: బీట్‌రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అయినప్పటికీ, దానిని అధికంగా తీసుకుంటే.. అందులో ఉండే చక్కెర పరిమాణం రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, డయాబెటిక్ రోగులు లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే వ్యక్తులు బీట్‌రూట్ తినడాన్ని తగ్గించాలి.

ఐరన్ సమృద్ధిగా ఉంటుంది: బీట్‌రూట్ ఐరన్ కు అద్భుతమైన మూలం.. ఇది సాధారణంగా ఇనుము లోపంతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, హిమోక్రోమాటోసిస్ వంటి పరిస్థితులు ఉన్నవారు బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడాన్ని నివారించాలి.

జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది: దుంపలు కొన్నిసార్లు జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి.. ముఖ్యంగా పెద్ద పరిమాణంలో తిసుకున్నప్పుడు ఉబ్బరం లేదా గ్యాస్‌కు కారణమవుతాయి.. అదనంగా, దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) లేదా ఇతర జీర్ణశయాంతర రుగ్మతలు ఉన్న వ్యక్తులలో ఈ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది.

అలెర్జీ రోగులు: బీట్‌రూట్ అలెర్జీలకు కారణమవుతుంది.. దీని వలన దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. బీట్‌రూట్ తిన్న తర్వాత అలెర్జీ లాంటివి కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..