జీవితంలో ఆహారం, డబ్బు లోటు లేకుండా ఉండాలంటే.. భాద్రపద పూర్ణిమ నాడు ఈ పరిహారం చేసి చూడండి..
వేద క్యాలెండర్ ప్రకారం, ఈసారి భాద్రపద మాసం పౌర్ణమీ తిథి సెప్టెంబర్ 07వ తేదీ ఆదివారం వచ్చింది. ఈ రోజు నుంచి పితృ పక్షం ప్రారంభం కానుంది. మత విశ్వాసం ప్రకారం ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి దానాలు చేయడం వల్ల అదృష్టం పెరుగుతుంది. అంతేకాదు ఈ పౌర్ణమి రోజున కొన్ని ప్రదేశాలలో దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీపానికి సంబంధించిన నివారణల గురించి తెలుసుకుందాం

వేద క్యాలెండర్ ప్రకారం పౌర్ణమి తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించడం ఆచారం. అలాగే పౌర్ణమి రోజున పవిత్ర నదిలో స్నానం చేస్తారు. దానం చేస్తారు. ఈ పరిహారం చేయడం వలన సాధకుడు శుభ ఫలితాలను పొందుతాడని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు నిలిచి ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు ఇంట్లో శాంతి, శ్రేయస్సు కోసం భాద్రపద పూర్ణిమ రోజున కొన్ని ప్రదేశాలలో దీపాలు వెలిగించండి. ఈ పరిహారం చేయడం ద్వారా ప్రతికూల శక్తి తొలగి లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో భాద్రపద పూర్ణిమ నాడు ఏ ప్రదేశాలలో దీపాలు వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుందో తెలుసుకుందాం..
జీవితంలో సంతోషంగా కోసం భాద్రపద పూర్ణిమ రోజున ఉదయం పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత నది తీరంలో దీపాలను వెలిగించండి. గుడిలో లేదా పేద ప్రజలకు ఆహారం, డబ్బు మొదలైన వాటిని విరాళంగా అందించండి. భాద్రపద పూర్ణిమ రోజున దీపాల దానం చేయడం వలన కుటుంబంలో శాంతి, ఆనందం కలుగుతుందని.. జీవితంలో ఆనందం లభిస్తుందని నమ్ముతారు.
జీవితంలోని బాధలు, కష్టాలు తొలగాలంటే శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు పొందాలనుకుంటే భాద్రపద పూర్ణిమ నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవుడి గుడిలో దేశీ నెయ్యితో దీపం వెలిగించండి. దీని తర్వాత, హారతి ఇచ్చి మంత్రాలు జపించండి. జీవితంలో ఆనందం, శాంతి కోసం భగవంతుడిని ప్రార్థించండి. ఈ పరిహారం చేయడం ద్వారా అన్ని దుఃఖాలు, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే భక్తుడికి శుభ ఫలితాలు లభిస్తాయి.
ఆహారం, డబ్బు కోసం మత విశ్వాసం ప్రకారం లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుంది. అటువంటి పరిస్థితిలో పూర్ణిమ రోజున తులసి దగ్గర దీపం వెలిగించి తులసి మొక్కకు 5 లేదా 7 సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది. ఇంట్లో సిరి సంపదలకు ఎప్పుడూ లోటు ఉండదు.
భాద్రపద పౌర్ణమి 2025 శుభ ముహూర్తం
ఈసారి భాద్రపద పౌర్ణమి తిథి ప్రారంభం – సెప్టెంబర్ 07 అర్థరాత్రి 01:41 గంటలకు
భాద్రపద పూర్ణిమ తిథి ముగింపు – 07 సెప్టెంబర్ రాత్రి 11:38 గంటలకు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)








