Lunar eclipse: ఈ నెల 7న రాహుగ్రస్థ చంద్ర గ్రహణం.. గర్భిణీస్త్రీల సహా ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..
ఈ సంవత్సరంలో రెండవ, చివరి చంద్ర గ్రహణం సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడనుంది. భాద్ర ప్రద మాసం పౌర్ణమి రోజున ఏర్పడనున్న ఈ చంద్ర గ్రహణం.. సంపూర్ణ చంద్రగ్రహణం. మన దేశంలో కూడా చంద్రగ్రహణం కనిపించనున్నది. ఈ నేపధ్యంలో చంద్ర గ్రహణ సూతక కాలం ఉంటుంది. అంతేకాదు ఈ గ్రహణం గర్బిణీ స్త్రీలతో పాటు రాహుగ్రస్థ చంద్ర గ్రహణం కనుక కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు గ్రహణం చూడవద్దు అని పండితులు చెబుతున్నారు.

భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం .. ఈ ఏడాదిలో చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం అది కూడా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహానికి అధ్యత్మికంగానే కాదు ఖగోళ పరంగా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. బ్లడ్ మూన్ గా ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే ఈ చంద్ర గ్రహణం భారత దేశంతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, ఫిజి, అంటార్కిటికా లో కూడా కనిపిస్తుంది. ఈ నెల 7వ తేదీన రాత్రి 9. 56 నిమిషాలకు ప్రారంభమై.. ఈ చంద్ర గ్రహణం అర్దరాత్రి 1.26 గంటల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.
శతబిష నక్షత్రంలో కుంభరాశిలో ఈసారి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. గ్రహణం సమయంలో సూతక కాలం ఉంటుంది. అంతేకాదు గర్భానీ స్త్రీలతో పాటు ప్రతి ఒక్కరూ అనేక జాగ్రత్తలు పాటిస్తారు. ముఖ్యంగా ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు ఇప్పుడు ఏర్పడనున్న గ్రహణం ప్రభావం కొన్ని రాశులపై చెడుగా ఉండనున్నదని.. వారు గ్రహణాన్ని చూడవద్దని పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో గర్భిణులు తీసుకొవాల్సిన జాగ్రత్తలు.. ఏ రాశులవారు గ్రహణం చూడకూడదో తెలుసుకుందాం..
ఏ రాశులవారు గ్రహణం చూడకూడదంటే..
ఆదివారం చంద్ర గ్రహణం శనీశ్వరుడు అధినేత అయిన కుంభ రాశిలో ఏర్పడనుంది. ఈ నేపధ్యంలో చంద్ర గ్రహణాన్ని కుంభ, సింహ రాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది. అంతేకాదు గ్రహణం ప్రభావం కొన్ని నెలల పాటు కుంభ, మీనం, మిథునం, సింహ రాశుల వారి పై ఉండనుంది. ఈ రాశులకు చెడు ఫలితాలు అధికంగా ఏర్పడనున్నాయి. కనుక వీరు తగిన పరిహారాలు చేయడం వలన కొంత మేర ఉపశమనం లభిస్తుంది.
గ్రహణం సమయంలో దుర్గా దేవిని పూజించడం, రాహుకి సంబంధించిన మంత్రాలతో జపం చేయడం, వెండి వంటివి దానం చేయాలి. అంతేకాదు గ్రహణం పట్టే సమయంలో.. విడిచే సమయంలో స్నానాలు ఆచరించడం వంటివి కొంత మేర శుభ ఫలితాలను ఇస్తాయి.
గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
- గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయం అంతా ఇంటిలోపలే ఉండాలి. గ్రహణానికి ముందు పట్టు స్నానం.. గ్రహణం విదించిన తర్వాత స్నానం తప్పనిసరిగా చేయాలి.
- ఆదివారం సాయత్రం ఆరులోపు ఏదైనా ఆహారాన్ని తినాలి. ఇంట్లో ప్రతి ఆహరపు వస్తువుల మీద, పూజ గదిలో దర్భలను లేదా తులసి దళాలను వేసుకోవాలి.
- గర్భిణీ స్త్రీలు మంచం మీద నిటారుగా నిద్రపోవాలి. కాళ్ల మీద కాళ్లు పెట్టుకుని కూర్చొవద్దు. ఒకవైపుకి తిరిగి అస్సలు పడుకొవద్దు.
- గ్రహణ సమయంలో ఆకలి వేస్తే జ్యూస్ లు వంటివి తీసుకోవచ్చు. నీరు తాగవచ్చు. ‘
- ఏ పనులు కూడా చేయవద్దు. ముఖ్యంగా పదునైన వస్తువులతో ఎటువంటి పనులు చేయవద్దు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)








