- Telugu News Photo Gallery These zodiac signs will face problems due to the influence of Rahu eclipse
గ్రహణం ఎఫెక్ట్ : ఈ రాశులవారికి కష్టాలు తప్పవు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంటుంది. ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. అయితే ఈ చంద్రగ్రహణాన్ని రాహుగ్రస్థ చంద్రగ్రహణం అంటారు. అయితే దీని ప్రభావం వలన ఐదు రాశుల వారికి కష్టాలు, సమస్యలు ఎదురు కానున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
Updated on: Sep 02, 2025 | 3:03 PM

మిథున రాశి : మిథున రాశి వారికి రాహు గ్రహణం ప్రభావం వలన అనేక కష్టాలు, నష్టాలు ఏర్పడుతాయంట, వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటి బయట ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు అధికం అయ్యి, అప్పులు పెరిగిపోతాయి. ఎవరైతే చాలా రోజుల నుంచి ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారికి ముప్పు తప్పదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కన్యా రాశి : కన్యా రాశి వారికి సమస్యలు అధికం అవుతాయి. ఇంట్లో గొడవలు ఎక్కువ అవ్వడం వలన మనశ్శాంతి కరువు అవుతుంది. పనులు వాయిదా పడటం, సమయానికి చేతికి డబ్బు అందక పోవడం, అనవసర ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి నిరాశే అంటున్నారు నిపుణులు.

తుల రాశి : తుల రాశి వారికి చాలా కష్టతరమైన రోజులు ఇవి. వీరు వీలైనంత వరకు ఆర్థిక వ్యవహారాలకు చాలా దూరంగా ఉండాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఈ రాశి వారు కుటుంబంలో సమస్యల వలన మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటా బయట ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు రాహు గ్రహణ కాలంలో, పెట్టుబడి పెట్టడం, వ్యాపారం చేయడం లేదా కొనడం,అమ్మడం వంటి డబ్బుకు సంబంధించిన ఏ పని చేయవద్దు. లేకపోతే ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. మీరు ప్రయాణిస్తుంటే, జాగ్రత్తగా ఉండండి, వీలైతే, ఈ ప్రయాణాన్ని వాయిదా వేయండి.

మీన రాశి : మీన రాశి వారికి గ్రహణ అనేక సమస్యలకు కారణం అవుతుంది. వీరు ఏ పని చేసినా అందులో విఫలం అవుతారు. వ్యాపారస్తులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనేక నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. ఒడిదొడుకులు అధికం అవుతుంది. ఆర్థిక నష్టం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది.



