AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన మన దేశంలోని చారిత్రక విద్యా సంస్థలు ఏమిటో తెలుసా.. విదేశీయులు సైతం క్యూ..

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5, 2025న జరుపుకుంటున్నారు. విద్య కేవలం జ్ఞానాన్ని సంపాదించే సాధనం కాదు, నాగరికతకు పునాది. భారతదేశ నేల అనేక విద్యా కేంద్రాలను అందించింది.. అవి అందించిన జ్ఞానం ప్రపంచానికి వ్యాపించింది. నలంద, తక్షశిల, శాంతి నికేతన్ కేవలం విద్యా సంస్థలు మాత్రమే కాదు.. భారతదేశ సైద్ధాంతిక వారసత్వం, బోధనా సంప్రదాయానికి సజీవ సాక్ష్యాలు. మన జ్ఞానానికి రుజువులు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ ప్రదేశాలను గుర్తుచేసుకోవడం.. విద్య , ఉపాధ్యాయ సంప్రదాయ వైభవాన్ని గౌరవించినట్లే.

ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన మన దేశంలోని చారిత్రక విద్యా సంస్థలు ఏమిటో తెలుసా.. విదేశీయులు సైతం క్యూ..
Ancient Educational Universities Of IndiaImage Credit source: social media
Surya Kala
|

Updated on: Sep 02, 2025 | 1:43 PM

Share

భారతీయులు మాతృదేవో భవ, పితృ దోవో భవ, ఆచార్య దేవో భవ అంటూ.. తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువు కి ఇచ్చారు. ఉపద్యాయుడిని దైవంగా భావించి పూజించే సంప్రదాయం మన సొంతం. దేశానికి రాజైనా ఒక ఉపాధ్యాయుడికి శిష్యుడే. మనకున్న అజ్ఞానపు పొరలను తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించి వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక విలువలు నేర్పి.. అందమైన భవిష్యత్ ని అందించే ఇలలో ప్రత్యక్ష దైవం ఉపాద్యాయుడు.. అందుకనే గురువని గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు జీవిత తత్వశాస్త్రం, విలువలు, సంస్కృతిని బోధించేవారు. అందుకే ప్రపంచం భారతదేశ ఉపాధ్యాయ సంప్రదాయాన్ని అత్యంత పురాతనమైనది. గొప్పది అని భావిస్తుంది. ఇప్పుడు ఏ విధంగా భారతీయులు విదేశాలకు విద్యనభ్యసించడానికి విదేశాలు వెళ్తున్నారో.. అదే విధంగా ఒకానొక సమయంలో మన దేశంలో విద్యని అభ్యసించేందుకు విదేశీయులు సైతం వచ్చేవారట. అటువంటి చారిత్రక విద్యా కేంద్రాల చరిత్ర, ప్రత్యేకత గురించి తెలుసుకుందాం.

ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు నలంద, తక్షశిల, శాంతి నికేతన్ వంటి చారిత్రక విద్యా సంస్థల గురించి తెలుసుకుందాం.. ఇవి భారతీయులను మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో విద్యార్థులను కూడా ఆకర్షించాయి. ఈ మూడు సంస్థల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ విద్య పుస్తకాలకే పరిమితం కాలేదు. ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు జీవిత తత్వశాస్త్రం, విలువలు, సంస్కారాలను బోధించారు. భారతదేశం ఉపాధ్యాయ సంప్రదాయాన్ని ప్రపంచం పురాతనమైనది. గొప్పదిగా పరిగణించడానికి ఇదే కారణం.

నలంద: నలంద విశ్వవిద్యాలయం బీహార్ రాష్ట్రంలో ఉంది. ఈ విద్యా సంస్థ క్రీ.శ. 5వ శతాబ్దంలో స్థాపించబడింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి నివాస అంతర్జాతీయ విశ్వవిద్యాలయం. ప్రాచీన భారతదేశంలోని మొట్టమొదటి ప్రధాన జ్ఞాన కేంద్రం. వేదాలు, తర్కం, గణితం, ఖగోళ శాస్త్రం, ఆధ్యాత్మిక, సనాతన ధర్మం వంటి అంశాలను ఇక్కడ బోధించేవారు. దీనిని “జ్ఞాన సముద్రం” అని పిలిచేవారు. మన దేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. నలంద భారతదేశం విశ్వవిద్యాలయంలో చైనా, మంగోలియా, టిబెట్, కొరియన్, ఆసియా దేశాల వంటి విదేశీ దేశాలకు చెందిన విద్యార్థులను ఆకర్షించింది. నలంద విద్యా కేంద్రంగా మాత్రమే కాదు ప్రపంచాన్ని ఏకంచేసే చిహ్నంగా కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

తక్షశిల విశ్వవిద్యాలయం: ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉంది. ఇది ప్రపంచంలోని పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటి. తక్షశిల క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో స్థాపించబడింది. ఇది ఒక ముఖ్యమైన విద్యా కేంద్రంగా ఉండేది. ఇక్కడ గురుకుల సంప్రదాయం ప్రకారం వివిధ విషయాల విద్య , వృత్తిపరమైన జ్ఞానం .. సమన్వయం ఉండేది. ఇక్కడ 10,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు, 200 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉఉండేవారు. రాజకీయాలు, యుద్ధం, వేదాలు, ఆర్థిక శాస్త్రం, వైద్యం వంటి అంశాలు బోధించబడ్డాయి. మానవ చరిత్రలో మొట్టమొదటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయం తక్షశిల. పాణిని, చాణక్య, చరుకుడు వంటి గొప్ప పండితులు ఈ ప్రదేశంలోనే విద్యను అభ్యసించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో జ్ఞాన కేంద్రంగా కూడా ఖ్యాతిని పొందింది. అలాగే యునెస్కో తక్షశిలను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.

శాంతి నికేతన్: శాంతినికేతన్‌ను ఆధునిక భారతదేశ విద్యా కేంద్రం అని పిలుస్తారు. 1863లో పశ్చిమ బెంగాల్‌లో మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌ను స్థాపించారు. తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని 1901లో గురుకుల శైలి పాఠశాలగా .. తరువాత 1921లో విశ్వభారతి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేశారు. ఈ విద్యా కేంద్రంలో సాంప్రదాయ విద్యా పద్ధతులకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా విధ్యనభ్యసించే విధానం ఉంటుంది. ఇక్కడ కళ, సాహిత్యం, సంగీతంపై ప్రాధాన్యత ఇవ్వబడింది. శాంతినికేతన్‌కు ప్రపంచ వారసత్వ ప్రదేశం హోదా కూడా ఉంది. ఇది దీనికి ప్రపంచ గుర్తింపును ఇచ్చింది. భారతీయ, పాశ్చాత్య విద్య ఆధునిక సమ్మేళనం ఇక్కడ ఉంది. ఇది విద్యార్థులకు వివిధ రకాల కోర్సులను అందిస్తుంది. నేటికీ విశ్వభారతి విశ్వవిద్యాలయంగా గుర్తింపు ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు