AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడాళ్ళా మజాకానా.. మెట్రోలో సీటు కోసం సిగపట్లు.. నేను జడ్జి కూతుర్ని వదలను అంటూ ఓ యువతి రుబాబ్..

ప్రస్తుతం ఉద్యోగం లేదా ఏదైనా పనిమీద ఎక్కడికి వెళ్ళాలన్నా.. చాలా దూరం ప్రయనించాల్సివస్తుంది. అందుకోసం బస్సు, మెట్రో ఏది ఎక్కినా వెంటనే సీటు దొరికితే బాగుండును అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. పురుషులైతే కాలు పెట్టడానికి బస్సులో చోటు దక్కినా చాలు అన్నట్లు అడ్జెస్ట్ అవుతారు. కానీ మహిళలు మాత్రం సీటు కోసం ఏకంగా సిగపట్లు కూడా పడతారు. అయితే ఇప్పుడు బస్సులో మాత్రమే కాదు మెట్రో ట్రైన్ లో కూడా మహిళలు సీటు కోసం కొట్టుకోవడానికి వెనుకాడడం లేదు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఆడాళ్ళా మజాకానా.. మెట్రోలో సీటు కోసం సిగపట్లు.. నేను జడ్జి కూతుర్ని వదలను అంటూ ఓ యువతి రుబాబ్..
Delhi Metro
Surya Kala
|

Updated on: Sep 02, 2025 | 1:07 PM

Share

ఢిల్లీ మెట్రో దేశ రాజధానికి జీవనాడి. ప్రతిరోజూ లక్షలాది మంది మెట్రో ట్రైన్ ద్వారా ప్రయాణిస్తారు. దీనివల్ల కొన్నిసార్లు ప్రయాణికుల చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద గొడవకు దారితీస్తుంది. కొన్నిసార్లు సీట్ల కోసం గొడవ పడటం, మొబైల్‌లో బిగ్గరగా మాట్లాడటం, లైన్ లో లేకుండా ఇష్టారీతిన రావడం వంటి విషయాలు సాధారణంగా ఉద్రిక్తతకు కారణమవుతాయి. ఈ రోజుల్లో అలాంటి ఒక వీడియో ప్రజల్లో వైరల్ అవుతోంది. మనం సహనంతో, మర్యాదతో ప్రయాణించాలని ఈ వీడియో ప్రతి ఒక్కరికీ తెలియజేస్తుంది.

వీడియో ప్రారంభంలో ఇద్దరు మహిళలు ఏదో విషయంపై గొడవ పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మహిళ మెట్రో సీటుపై కూర్చుని ఉండగా.. మరొకరు స్త్రీ నల్లటి దుస్తులు ధరించి నిలబడి దూకుడుగా ప్రవర్తిస్తోంది. ఈ సమయంలో ఇద్దరి మధ్య ఉద్రిక్తత చాలా పెరుగింది. అక్కడ ఉన్న మిగిలిన వ్యక్తులు జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. అయినా ఈ పోరాటం ఎంతవరకు చేరుకుంటుందంటే.. ఈ ఇద్దరూ గొడవని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు.

వీడియోను ఇక్కడ చూడండి

మెట్రో కోచ్‌లో ఉన్న ఒక మహిళ, ఒక పురుషుడు,ఒక పోలీసు కూడా కోపంగా ఉన్న మహిళను శాంతింపజేయడానికి ప్రయత్నించడం వీడియోలో చూడవచ్చు. అయితే ఆ యువతి కోపం తగ్గే బదులుగా మరింతగా పెరిగింది. వీడియోలో నల్లటి దుస్తులు ధరించిన మహిళ ‘నేను ఒక జడ్జి కూతురిని, నేను ఆమెని వదిలిపెట్టను.. ఇప్పుడు చూడండి’ అని చెప్పడం స్పష్టంగా వినవచ్చు. ఆ యువతి గొంతు, స్వరం ఆమె తనను తాను ఇతరులకన్నా ఉన్నతంగా భావిస్తుందని చూపిస్తుంది.

మరోవైపు సీటుపై కూర్చున్న మహిళ తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని పదే పదే చెబుతూనే ఉంది. విషయం తీవ్రం కాకుండా చూసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంది. అయినా సరే యువతి ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉంది. ఆ యువతిని ముగ్గురు వ్యక్తులు కూడా ఆపలేకపోయారు.. అంత స్ట్రాంగ్ గా ఉంది. ఈ వీడియోను Xలో @gharkekalesh అనే ఖాతా ద్వారా షేర్ చేయబడింది. ఇప్పటి వరకూ ఈ వీడియోను వేలాది మంచి చూడగా.. వందలాది మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..