AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యాభర్తల జీవితంలో ఆనంద రహస్యాన్ని చెప్పిన వృద్ధ జంట.. నెటిజన్ల మనసు దోచిన వీడియో

వృద్ధ దంపతుల వైరల్ వీడియో ప్రజల హృదయాలను గెలుచుకుంది. నిజానికి ఈ వీడియోలో వృద్ధుడైన భర్త తన భార్యకు వంటగది పనిలో సహాయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. భార్య పరాఠాలు చేస్తుంటే.. భర్త పాలు మరిగిస్తున్నాడు.. భార్య అప్పడాలు వేయిస్తుంటే.. భర్త సలాడ్ ని రెడీ చేస్తున్నాడు. బహుశా ఇదే వారి జీవితంలో ఆనంద రహస్యం కావచ్చు.

భార్యాభర్తల జీవితంలో ఆనంద రహస్యాన్ని చెప్పిన వృద్ధ జంట.. నెటిజన్ల మనసు దోచిన వీడియో
Old Couple Video Viral
Surya Kala
|

Updated on: Sep 02, 2025 | 4:21 PM

Share

భార్యాభర్తల మధ్య బంధం జన్మ జన్మల బంధం అని నమ్ముతారు. వివాహం అనేది కేవలం ఒక జన్మ బంధం కాదని.. ఏడు జన్మల వరకూ కొనసాగే ఆత్మల కలయిక అని అంటారు. అయితే ఈ రోజుల్లో చాలా వివాహాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. ఎందుకంటే భార్యాభర్తలు తమ ఆలోచనలు కలవడం లేదని విడిపోతున్నారు. అయితే ప్రస్తుతం ఒక వృద్ధ జంట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది ప్రజల హృదయాలను గెలుచుకుంది.

ఈ వీడియోలో వృద్ధ భర్త తన వృద్ధ భార్యకు వంటగది పనిలో సహాయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. భార్య పరాఠాలు చేస్తుంటే.. భర్త పాలు వేడి చేస్తున్నాడు. భార్య అప్పడాలు వేయిస్తుంటే.. భర్త సలాడ్ కోసం కీర దోస కాయ తొక్క తీస్తున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో భార్యాభర్తలు వంటగదిలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా నవ్వుతూ పనిని ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా వృద్ధాప్యంలో భార్యాభర్తలు వంటగదిలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆహారం వండుకునే దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే భార్యాభర్తలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవిస్తే.. జీవితం సంతోషంగా ఉంటుందని అంటారు.

వృద్ధ దంపతుల ప్రేమ హృదయాన్ని హత్తుకునే ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @musafir_vj అనే ఐడి షేర్ చేసింది. స్నేహితులు, బంధువులు ఏదోక రోజు మిమ్మల్ని వదిలివేస్తారు. చివరికి మీరు వివాహం చేసుకున్న వ్యక్తి మాత్రమే మీతో జీవితాంతం మిగిలి ఉంటాడు’ అని క్యాప్షన్ ఉంది.

వీడియోను ఇక్కడ చూడండి

కేవలం 19 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్ష 54 వేలకు పైగా వీక్షించగా, 4 వేలకు పైగా ప్రజలు దీన్ని లైక్ చేసి వివిధ రకాల కామెంట్స్ చేశారు. ‘ఇద్దరూ కలిసి ఉండటం అదృష్టం. ఈ ప్రపంచంలోని ఆచారాల నుంచి బయటపడి.. భార్యాభర్తల బంధం అంటే ఒకరికొకరం అని బంధాన్ని అర్ధం చేసుకుని నిర్వర్తిస్తున్న కొద్దిమంది మాత్రమే ఉన్నారు’ అని రాశారు. ‘ఇది నిర్మలమైన ప్రేమగల తల్లుల చివరి తరం. ఆధునిక స్త్రీవాదులు నిజంగా క్రూరమైనవారు’ అని రాశారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..