AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి విందుకు వచ్చిన చిరుత.. భయంతో పరుగులుపెట్టిన అతిథులు..! ఆ తర్వాత జరిగింది చూస్తే..

పెళ్లి విందు జరుగుతున్న ఒక ప్రదేశంలోకి హఠాత్తుగా ఒక చిరుతపులి ప్రవేశించింది. చిరుతను చూసిన పెళ్లి బృందం ఒక్కసారిగా హడలెత్తిపోయింది. ప్రతి ఒక్కరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఎటు చూసినా జనం అరుపులు, కేకలతో భయానక వాతావరణం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో

పెళ్లి విందుకు వచ్చిన చిరుత.. భయంతో పరుగులుపెట్టిన అతిథులు..! ఆ తర్వాత జరిగింది చూస్తే..
Leopard Entered Wedding Ceremony
Jyothi Gadda
|

Updated on: Dec 18, 2025 | 5:51 PM

Share

ఖరీదైన పెళ్లి విందు ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. వివాహ వాతావరణం, అలంకరించబడిన డైనింగ్ టేబుల్, అతిథుల బృందాలు.. అంతా సజావుగా జరుగుతుండగా అకస్మాత్తుగా ఒక షాకింగ్‌ దృశ్యం కనిపించింది. అది అక్కడి ఆనందాన్ని భయనక వాతావరణంగా మార్చేసింది. భోజనాలు చేస్తున్న అతిథుల గుంపు మధ్యలోకి ఒక చిరుతపులి అకస్మాత్తుగా ప్రవేశించింది. క్షణంలో వివాహ వేడుక గందరగోళంగా మారిపోయింది. ప్రజలు ప్రాణాల కోసం పరిగెత్తారు. కుర్చీలు బోల్తా పడ్డాయి. పెళ్లి మండపం, డైనింగ్‌ ఏరియా మొత్తం అరుపులతో ప్రతిధ్వనించింది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

పెళ్లి విందు జరుగుతున్న ఒక ప్రదేశంలోకి హఠాత్తుగా ఒక చిరుతపులి ప్రవేశించింది. చిరుతను చూసిన పెళ్లి బృందం ఒక్కసారిగా హడలెత్తిపోయింది. ప్రతి ఒక్కరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఎటు చూసినా జనం అరుపులు, కేకలతో భయానక వాతావరణం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రజలు భోజనం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో చిరుతపులి మెల్లిగా ఆ డైనింగ్‌ హాల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అది మొదట ఫుడ్ కౌంటర్ పై దాడి చేసి, దానిని కూల్చివేసింది. తరువాత సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తుల వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి భయాందోళనలకు గురిచేసింది.

ఇవి కూడా చదవండి

అయితే, వీడియో చూస్తుంటే.. జనం రద్దీ ఎక్కువగా ఉన్న డైనింగ్‌ హాల్‌లోకి వచ్చిన చిరుతపులి కూడా భయపడిపోయిందని అర్థమవుతోంది. అక్కడి నుండి ఎలాగైన బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో అది చాలా వేగంగా పరిగెత్తుతుంది. ఈ క్రమంలోనే అక్కడి వస్తువులన్నీ కిందపడిపోవటం కనిపించింది. ప్రజలు సైతం పులికి భయపడి పరిగెత్తడం ప్రారంభిస్తారు. అయితే, ఈ వీడియో నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేశారు.. బహుశా ఈ వీడియో AI ద్వారా క్రియేట్‌ చేసి ఉంటారని అంటున్నారు. వీడియో చూస్తుంటే చిరుతపులి ఎవరిపైనా దాడి చేయలేదని తెలుస్తోంది.

అయితే, ఈ వీడియోని @Mr_arbaz_77 అనే అనామక ఖాతా ద్వారా షేర్ చేయబడింది. ఇప్పటికే ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. చాలామంది దీనిని ఇష్టపడ్డారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు చిరుతపులి ఆకలితో ఉన్నట్లు అనిపిస్తుంది అని రాశారు. మరొకరు ఆ మహిళలు పట్టించుకోవటం లేదని, వారు తినడంలో బిజీగా ఉన్నారు అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..