Cardamom for Skin: యాలకులతో మీ చర్మ రంగును మెరుగు పరచుకోండి..

యాలక్కాయతో చర్మ రంగును ఇంప్రూవ్ చేస్తుంది. యాలకులు కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా అందాన్ని పెంచడంలో కూడా ఉపయోగించుకోవచ్చు. యాలకుల పొడి చర్మాన్ని అందంగా మార్చుతుంది..

Cardamom for Skin: యాలకులతో మీ చర్మ రంగును మెరుగు పరచుకోండి..
Cardamom
Follow us
Chinni Enni

|

Updated on: Nov 13, 2024 | 4:20 PM

ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్‌లో ఎక్కువగా అందరూ అందానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందంగా ఉండటాన్ని ఆత్మ విశ్వాసంగా భావిస్తున్నారు. అందంగా ఉంటేనే ఏదన్నా సాధించగలమని అనుకుంటున్నారు. కానీ అందంగా ఉండటం అనేది అంత ఈజీగా కాదు. అందం అనేది లోపలి నుంచి రావాలి. పైపైన ఎంత మేకప్ వేసి కవర్ చేసినా అది కొన్నాళ్లకే. అదే లోపలి నుంచి అందంగా ఉంటేనే లైఫ్ లాంగ్ ఒకేలా కనిపించగలరు. అందంగా కనిపించడం కోసం ఏవేవో చేస్తూ ఉంటారు. ఖరీదైన ప్రాడెక్ట్స్ కూడా ఉపయోగిస్తారు. కానీ మన వంట గదిలో ఉండే వాటితోనే మన అందాన్ని సహజంగా రూపు దిద్దుకోవచ్చు. కొంతమంది నలుపుగా, ఛామన ఛాయగా ఉంటారు. ఇలాంటి వారు తెలుపు రావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఎన్నో రసాయనాలు కలిపిన కాస్మెటిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పువు. కానీ యాలకులతో మీ రంగును మెరుగుపరచుకోవచ్చు. యాలకులను ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని క్లీన్ చేసి.. డార్క్ స్పాట్స్‌ని తగ్గించి, మొటిమలు, ముడతలను కంట్రోల్ చేసి.. చర్మ ఛాయని పెంచుతాయి. మరి యాలకులను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె – యాలకుల పొడి:

ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా తేనె, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పింపుల్స్ ఉన్న చోట, పింపుల్స్ మచ్చలు ఉన్న చోట రాస్తే.. ఓ పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

పెరుగు – యాలకుల పొడి:

యాలకుల పొడిని పెరుగులో కూడా కలిపి పెట్టుకోవచ్చు. ఇవి రెండూ చర్మాన్ని చక్కగా క్లీన్ చేస్తాయి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పెరుగు, కొద్దిగా పసుపు, యాలకుల పొడి కొద్దిగా వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం అంతా అప్లై చేయాలి. ఓ పావు గంట తర్వాత ఫేస్ వాష్ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే చర్మ రంగు మెరుగు పడుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!