- Telugu News Photo Gallery Folic acid is essential for everyone's health, Check Here is Details in Telugu
Folic Acid: ఫోలిక్ యాసిడ్ గర్భిణీలే కాదు.. అందరికీ అవసరమే..
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అవసరం అవుతాయి. ఈ క్రమంలోనే గర్భిణీలు ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం వైద్యులు ఫోలిక్ యాసిడ్ ఇస్తారు. అయితే ఇది కేవలం ప్రెగ్నెంట్ లేడీస్‌కే కాకుండా అందరూ వేసుకోవచ్చు..
Updated on: Jan 02, 2025 | 3:42 PM

ఫోలిక్ యాసిడ్ అంటే.. అందరికీ గర్భిణీలే గుర్తుకు వస్తారు. బిడ్డ ఎదుగుదలలో ఈ ఫోలిక్ యాసిడ్ ఎంతో హెల్ప్ చేస్తుంది. ఫోలిక్ యాసిడ్ అంటే విటమిన్ బి9. ఈ విటమిన్ తీసుకోవడం వల్ల పిల్లలు ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా జన్మిస్తారు.

ఈ విటమిన్ కేవలం గర్భిణీలకే కాదు.. అందరికీ అవసరమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఫోలిక్ యాసిడ్‌తో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఫోలిక్ యాసిడ్ అందరూ తీసుకోవాలి.

ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను తీసుకుంటే.. పెద్దపేగు, గర్భాశయ, క్లోమ గ్రంథి క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. మతి మరుపు, అల్జీ మర్స్ వంటి వ్యాధులు కూడా రాకుండా అడ్డుకుంటుంది. వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు రావు. జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.

రక్త కణాలు తయారయ్యేందుకు కూడా విటమిన్ బి9 సహాయ పడుతుంది. ఆహారాలు అయినా, ట్యాబ్లెట్స్ అయినా తీసుకుంటే రక్తం బాగా తయారవుతుంది. అనీమియా సమస్య కూడా ఏర్పడదు. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కూడా హెల్ప్ చేస్తుంది.

మెదడు ఆరోగ్యాంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. మెదడు యాక్టీవ్‌గా ఉంటే శరీరంలో ఇతర పనులు కూడా త్వరగా జరుగుతాయి. కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ అందరూ తీసుకోవచ్చు. అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




