చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే జలుబు, దగ్గు వస్తాయనేది ఒక అపోహ మాత్రమే. వైరస్లు, బ్యాక్టీరియా వల్ల ఈ సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉన్నవారు చలికాలంలో ఐస్ క్రీమ్ తినవచ్చు. అయితే, గొంతు నొప్పి లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు చల్లని, చక్కెర అధికంగా ఉన్న ఐస్ క్రీమ్కు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.