AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి

ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి

Phani CH
|

Updated on: Dec 28, 2025 | 7:08 PM

Share

తెలంగాణలో చలి తీవ్రత ప్రజలను వణికిస్తోంది, పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డిసెంబర్ 31 వరకు ఈ చలి కొనసాగుతుందని, జనవరిలో మళ్లీ పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చలి నుంచి రక్షణకు ఉన్ని దుస్తులు, వేడి ఆహారం, ద్రవాలు తీసుకోవడం, పిల్లలు, వృద్ధుల సంరక్షణ వంటి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

తెలంగాణలో చలి వణికిస్తోంది. అనేక జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా, సంక్రాంతికి మళ్లీ చలి పెరిగి, చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నాలుగైదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు.. 3 నుండి 4 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నారు అధికారులు.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చలి గాలులు మొదలయ్యాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జరిగిన గణాంకాలను పరిశీలిస్తే.. 7 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదయ్యాయి. అత్యల్పంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 7.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.8 డిగ్రీల సెల్సియస్, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 8.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను వణికించాయి. చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఉన్ని దుస్తులు, స్వెటర్లు, మఫ్లర్లు, గ్లౌజులు ధరించాలి. ఒకే మందపాటి దుస్తువు కంటే రెండు మూడు పొరలుగా పలచని వెచ్చని దుస్తులు ధరించడం వల్ల శరీర వేడి బయటకు పోకుండా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి వేడివేడి ఆహారం తీసుకోవాలి. అల్లం టీ, పసుపు కలిపిన పాలు, సూప్‌లు వంటివి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి, తెల్లవారుజామున చలి గాలి తగలకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం ఉత్తమం. చలి వల్ల చర్మం పొడిబారడం, పెదవులు పగలడం వంటివి జరుగుతుంటాయి. మాయిశ్చరైజర్లు లేదా కొబ్బరి నూనె వాడటం వల్ల ఉపశమనం లభిస్తుంది. జలుబు, దగ్గు లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

Jailer 02: జైలర్‌ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే

విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు