ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40 కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎర్రకోట కారు బాంబు పేలుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు, డాక్టర్ల హస్తం వెల్లడి కావడంతో దేశం ఉలిక్కిపడింది. డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి చేసుకోగా, అనేక మంది వైద్యులతో కూడిన 'వైట్ కాలర్' ఉగ్రవాద మాడ్యూల్ బయటపడింది. జమ్మూకశ్మీర్ పోలీసులు కీలక అరెస్టులతో దర్యాప్తు కొనసాగుతోంది.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా షాకింగ్ కామెంట్స్ చేశారు. పేలుడులో పాక్ ఉగ్రవాదుల హస్తం ఉందని తేలడంతో దేశమంతా ఉలిక్కిపడింది. ఢిల్లీలో యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్ లో ఆయన ఈ మేరకు మాట్లాడారు. 40 కిలోల పేలుడు పదార్థాలను వాడినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ కేసు దర్యాప్తును అద్భుతంగా చేశారని, పేలుడుకు ముందే మూడు టన్నుల పదార్థాలను స్వాధీనం చేసుకుని, నిందితుల్ని ఢిల్లీ పేలుడుకు ముందే అరెస్ట్ చేశారని అన్నారు. నవంబరు 10న జరిగిన కారు బాంబు పేలుడులో 15 మంది మృతి చెందారు. ఉగ్రవాది డాక్టర్ ఉమర్ ఐ20 కారులో ఆత్మాహుతి చేసుకొని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో అల్-ఫలాహ్ వర్సిటీకి చెందిన చాలా మంది డాక్టర్లకు సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ కేసుపై విస్తృత స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. ఘటనకు సంబంధించిన 15 సెకన్ల క్లిప్‌లో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో i20 కారు వెళ్తున్నట్టుగా ఉంది. ఘటనా స్థలంలో ఉవ్వెత్తున్న ఎగిసిపడిన భారీ మంటలు కనిపిస్తాయి. సాయంత్రం 6.50 గంటలకు డాక్టర్ ఉమర్.. కారులో తనను తాను పేల్చుకున్నాడు. పేలుడు ధాటికి సీసీటీవీ పగిలింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. విచారణలో జైషే మహమ్మద్ ‘వైట్ కాలర్’ ఉగ్ర మాడ్యూల్ బయటపడింది. కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కు విస్తరించిన ఈ కుట్రలో ముగ్గురు డాక్టర్లు సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసారు కశ్మీర్ పోలీసులు. 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్ సహా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఢిల్లీలో పేలుడు జరిగింది. వైద్యులను పోలీసులు అరెస్ట్ చేయడంతో తాను కూడా దొరికిపోతానని భయపడి డాక్టర్ ఉమర్ పేలుడుకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్
Jailer 02: జైలర్ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

