షాపింగ్ వ్యసనం ఉన్నవారు నిత్యం ఏదో ఒకటి కొనుగోలు చేయాలనే తపనతో ఉంటారు. ఇది మానసిక ఆరాటం, చిరాకుకు దారితీస్తుంది. అవసరం లేని వస్తువులు కొని, అప్పుల పాలవుతారు. ఈ పరిస్థితి తీవ్రమైతే యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. సైకాలజిస్టులు బిహేవియరల్ థెరపీ, కౌన్సిలింగ్ ద్వారా దీనికి చికిత్స అందిస్తారు.