Get Rid of Mosquitoes: ఇవి మీ ఇంటి మూలల్లో పెడితే దోమలు అటువైపుకే రావు..
దోమల బెడద తగ్గించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తలుపులకు, కిటీలకు దోమ తెరలు కూడా ఏర్పాటు చేస్తారు. కానీ దోమలు వస్తూనే ఉంటాయి. ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా ఉండాలంటే.. ఇప్పుడు చెప్పిన చిట్కాలు ఎంతో చక్కగా పని చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు చూసేయండి..
ప్రస్తుత కాలంలో విష జ్వరాలు అనేవి బాగా ఎక్కువైపోయాయి. వీటికి ముఖ్య కారణం దోమలు. ఇవి కుట్టడం వల్లనే విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రాత్రైనా, పగలైనా దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమలు ఎక్కువగా కుట్టడం వల్ల అనేక రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వచ్చాయంటే.. అంత త్వరగా తగ్గవు. చాలా మంది ఈ జ్వరాల తీవ్రతను తట్టుకోలేక మరణించిన వారు కూడా ఉన్నారు. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. దోమలు అసలు ఇంట్లోకి రానివ్వకుండా చూసుకోవాలి. దోమ తెరలు, డోర్లు ఏర్పాటు చేయాలి. అందులోనూ వర్షా కాలం, చలి కాలంలో కూడా దోమల బెడద ఎక్కువగానే ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఇంట్లో ఉండే వస్తువులు కొన్నింటిని ఇంటి మూలల్లో పెడితే దోమలు రాకుండా ఉంటాయి. మరి అవేంటో చూసేయండి.
వెల్లుల్లి:
వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. వెల్లుల్లి నుంచి మంచి ఘాటు వాసన వస్తుంది. ఈ వాసన దోమలకు అస్సలు పడదు. దోమలు రాకుండా వెల్లుల్లి మనం ఉపయోగించుకోవచ్చు. వెల్లుల్లిని దంచి రసం తీసి తలుపులు, కిటికీటు, ఇంటి మూలల్లో స్ప్రే చేయండి. లేదా దంచి ఇంటి మూలల్లో ఉంచినా దోమలు రాకుండా ఉంటాయి.
పుదీనా:
పుదీనా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉంటాయి. పుదీనా నుంచి కూడా మంచి చక్కని సువాసన వస్తుంది. ఈ వాసన కూడా దోమలకు పడదు. ఇంటి మూలల్లో పుదీనా మొక్కలను పెట్టండి. పుదీనా రసం లేదా ఆకులను అయినా ఇంటి మూలల్లో కొడితే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
తులసి:
తులసి మొక్కల్ని ఇంట్లో పెంచుకున్నా అటు వైపుకు దోమలు రాకుండా ఉంటాయి. తులసి ఆకుల నుంచి కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన అంటే దోమలకు పడదు. కాబట్టి ఇంటి మూలల్లో తులసి ఆకుల్ని ఉంచండి.
వేప ఆకులు:
దోమలకు వేపాకుల వాసన కూడా నచ్చదు. వేపాకులు కూడా మనకు సులభంగా లభిస్తాయి. వేపాకుల్ని ఇంటి మూలల్లో ఉంచినా లేక వేప నూనె ఇంటి మూలల్లో స్ప్రే చేసినా దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..