ఆడపిల్ల ఉన్న తండ్రి ఆయువు పెరుగుతుందా.?
TV9 Telugu
04 January
202
5
ఆడపిల్ల పుట్టిందంటే తండ్రికి ఆయువు క్షీణం అన్నది పాత సామెత. ఆడపిల్ల ఉన్న ఇంట్లో తండ్రి ఆయువు పెరుగుతుందని తేలింది.
ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవిస్తారని పోలండ్‌లోని జాగిలోనియన్ యూనివర్సిటీ సర్వేలో తేలింది.
తండ్రుల జీవితకాలాన్ని ప్రతి కుమార్తె సుమారు 74 వారాల పాటు అంటే ఆరేళ్లకు పైగా పెంచుతుందని యూనివర్సిటీ సర్వేలో తేలింది.
2,147 మంది తల్లులు, 2,163 మంది తండ్రులపై విశ్లేషించిన డేటా ఆధారంగా తీసుకొని పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు.
కొడుకులు ఉన్న తండ్రులను, కూతుళ్లు ఉన్న తండ్రుల మధ్య జీవితకాల వ్యత్యాన్ని స్పష్టంగా గుర్తించారు పరిశోధకులు.
కొడుకుల సంఖ్య తండ్రుల జీవితకాలంపై ఎలాంటి ప్రభావం చూపలేదని జాగిలోనియన్ యూనివర్సిటీ సర్వేలో పరిశోధకులు తెలిపారు.
మరో అధ్యయనం ప్రకారం.. కుమార్తెలు, కుమారులు ఇద్దరూ ఒంటరి తల్లుల జీవితకాలాన్ని పెంచుతున్నట్లు తెలిసింది.
పిల్లలు లేని వారితో పోల్చితే ఆడ, మగ ఎవరున్నా సరే తల్లితండ్రులు ఎక్కువ కాలం సంతోషంగా జీవించే అవకాశం అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ విషయంలో బంగారం, వాజ్రం కంటే వెండికి విలువ ఎక్కువ.!
ఈ యాప్‌తో బంగారం స్వచ్ఛతను తెలుసుకోండిలా..
డెబిట్ కార్డులకు కాలం చెల్లిపోతుందా.?