ఆ విషయంలో బంగారం, వాజ్రం కంటే వెండికి విలువ ఎక్కువ.!
TV9 Telugu
03 January 2025
వెండి జిలుగుల ముందు వజ్రమైనా చిన్నబోవల్సిందే. వెండి బంగారం, వజ్రం లాంటి వాటి కంటే మంచి పెట్టుబడి సాధనం కూడా.
గాలిలోని ఆక్సిజన్ ప్రభావంతో వెండి రంగు మారుతుంది కాబట్టి, గాలి చొరబడని సంచిలో వెండి వస్తువులను భద్రపరచాలి.
ఒక్కో వెండి వస్తువును ఒక్కో కాగితంలో చుడితే.. వెండి పాత్రల మీద అస్సలు ఎలాంటి గీతలు పడకుండా కాపాడుకోవచ్చు.
వెండిని భద్రపరిచే పాత్రలో ఓ బొగ్గు ముక్క లేదా సిలికా జెల్ ప్యాక్ కనుక వేస్తే అవి గాలిలోని తేమను పీల్చేస్తాయి.
ఆభరణాల మార్కెట్‌లో బంగారానికి ఉన్నంత ఆదరణ వెండికీ ఉంది. నిజానికి ట్రెండీ నగల తయారీ వెండితోనే సాధ్యపడుతుంది.
వెండి కళాత్మక వస్తువులకు వెల్వెట్ లేదా మైక్రోఫైబర్ ప్యాకింగ్ ఉత్తమం. రజతం అత్యుత్తమ పెట్టుబడి మార్గం కూడా ద్రవ్యోల్బణాన్ని నిలువరించే శక్తి దీనికి ఉంది.
అందుకే బంగారంపై కంటే వెండిపై పెట్టుబడి పెట్టడం ఎంతో ఉత్తమం అని ఇన్వెస్ట్మెంట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి పెట్టుబడి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. బంగారంతో పోల్చుకొంటే వెండి ఎక్కువ కలం మెరుగుపోకుండా మెరుస్తూ ఉంటుంది.