- Telugu News Photo Gallery If you use Bhringraj leaves like this, hair problems will go away, Check Here is Details
Bhringraj Leaves: అద్భుతమైన ఈ ఆకుల్ని ఇలా వాడితే.. మీ జుట్టు సమస్యలు దూరం..
ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు రాలిపోవడంతో ఎంతో బాధ పడుతున్నారు. మరి కొంతమంది ఒత్తిడికి కూడా గురవుతున్నారు. జుట్టు సమస్యలను పరిష్కరించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలను ట్రై చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి..
Updated on: Jan 04, 2025 | 9:50 PM

జుట్టుకు సంబంధించి ఎంతో మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిని ఒక్క క్షణంలో చెప్పడం కష్టం. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు, ఒత్తిడి, మందులు ఎక్కువగా వాడటం, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్, వాతావరణ కాలుష్యం, ఆహారం ఇలా చాలా కారణాలు ఉంటాయి.

జుట్టు రాలుతూ ఉండటం వల్ల చాలా మంది మరింత ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. దీంతో జుట్టు కాపాడుకోవడం కోసం చాలా మార్కెట్లో ఉండే ఎన్నో రక రకాల ప్రాడెక్ట్స్ వాడుతూ ఉంటారు. వీటి వలన ఉండే బెనిఫిట్స్ చాలా తక్కువగా ఉంటాయి.

కానీ నేచురల్‌గా మనకు లభించే వాటితోనే మన జుట్టుకు అందంగా, ఒత్తుగా, పొడ్డుగా పెంచుకోవచ్చు. ఇలా మనకు ఈజీగా లభించేవి భృంగరాజ్. ఇది ఆయుర్వేదంలోనే రారాజుగా పిలుస్తారు. జుట్టు సమస్యలను తగ్గించడంలో ఎంతో చక్కగా పని చేస్తుంది.

మార్కెట్లో లభించే భృంగరాజ్ ఆకుల పొడి లేదా మీకు దగ్గరలో మొక్క ఉంటే ఆకుల్ని తీసుకుని శుభ్రంగా కడిగి ఎండలో ఎండ బెట్టి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని మీరు వాడే కొబ్బరి నూనెలో కలపండి. చేతికి గ్లౌజులు ధరించి తలకు పట్టించండి.

ఈ పొడిని నీటిలో అయినా కలిపి పేస్టులా తలకు అప్లై చేయాలి. ఇలా అరగంట ఉంచిన తర్వాత జుట్టును వాష్ చేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.. మంచి సొగసైన జుట్టు మీ సొంతం అవుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




