మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రవి, కుజ, శుక్రుల అనుకూలత వల్ల తప్పకుండా ఉద్యోగంలో అధికార లాభం, ధన లాభం కలుగు తాయి. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది కానీ, కుటుంబపరంగా కొన్ని చికాకాలు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ వంటివి అత్యధిక లాభాలనిస్తాయి. బంధుమిత్రు లతో శుభ కార్యంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమా జంలో మంచి పరిచయాలు కలుగుతాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. విద్యార్థు లకు సమయం అనుకూలంగా ఉంది. తరచూ ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది.