రాగులతో A టు Z రోగాలు పరార్..! లాభాలు తెలిస్తే..

04 January 2025

Jyothi Gadda

TV9 Telugu

తృణ ధ్యాన్యాల్లో ఒకటైన రాగులను పేదవాడి ఆహారంగా చెబుతారు. వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగులలో కాల్షియం, ఐరన్ తో పాటూ బోలెడు పోషకాలు ఉంటాయి. 

TV9 Telugu

రాగులలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, భాస్వరం, అధిక ఫైబర్ ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పాటూ మలబద్దకాన్ని నివారిస్తుంది.

TV9 Telugu

ఐరన్​, క్యాల్షియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగిన వీటిని తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చట. ఫైబర్​ సమృద్ధిగా ఉండి, అసంతృప్త కొవ్వులు తక్కువ. 

TV9 Telugu

రాగుల్లో అధికంగా లభించే ఫైబర్​ మీ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మిమ్మల్ని అతిగా తినకుండా ఆపుతుంది. చాలాసేపటి వరకు మీ కడపును నిండుగా ఉంచుతుంది.

TV9 Telugu

ఫిట్​నెస్​ ప్రియులు, ఉబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

TV9 Telugu

రాగి పిండిలో పుష్కలంగా లభించే మెగ్నీషియం, పొటాషియంలు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. రాగులు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

TV9 Telugu

రాగులను తరచుగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే రాగుల్లో ఫైబర్​ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.

TV9 Telugu

రాగుల్లోని ఫైబర్​ మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీంతో పాటు అరుగుదల సమస్యలు, మలబద్ధకం, కడుపుబ్బరం లాంటి ఇతర జీర్ణ రుగ్మతలను నయం చేస్తాయి. 

TV9 Telugu