సంక్రాంతి వచ్చేస్తుంది.. గాలిపటం ఎగరవేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఏవో తెలుసా?
TV9 Telugu
Pic credit - Pixabay
సంక్రాంతి పండుగ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ ఒక్క చోట చేరి పిండి పదార్థాలు చేసుకొని, ఇంటి ముందు ముగ్గులు వేసి చాలా ఆనందంగా ఈ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు..
ఈ మకర సంక్రాంతి పండుగ అంటే అందరికీ ఎక్కువగా గుర్తు వచ్చేది, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, కోడి పందాలు, గాలిపటాలు .
ముఖ్యంగా ఈరోజు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ గాలి పటాలు ఎగరవేస్తూ, చాలా సంతోషంగా గడుపుతూ, తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు.
ఇక పెద్దవారు కూడా చిన్న పిల్లల్లా మారిపోయి, ఆకాశంలోకి గాలిపటాన్ని ఎగరవేస్తూ, మురిసిపోతారు, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా కైట్ ఫెస్టివల్స్ జరపడం, పోటీలు నిర్వహించడం చేస్తారు.
ఇక గాలిపటం ఎగరవేసే సమయంలో, మన కైట్ ఆకాశంలో చాలా ఎత్తుకి వెళ్లిపోతే, మనలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు మరి.
అయితే అలా మనం ఎగరవేసే గాలి పటం చాలా ఎత్తుకు ఎగరాలంటే దానికి మంచి స్థలం కూడా అవసరం. అందుకే అసలు కైట్ ఎగర వేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
గాలిపటం ఆకాశంలో చాలా ఎత్తులో ఎగరాలంటే విశాలంగా ఉన్న ప్రాతం, గాలి ఎక్కడైతే స్థిరంగా ఉంటుందో, అక్కడ గాలిపటం ఎగర వేస్తే అది చాలా ఎత్తుకి ఎగురుతుంది.
ముఖ్యంగా పార్కులు, గార్డెన్స్, పొలాలు, బీచ్‌లు కైట్ ఎగర వేయడానికి బెస్ట్ ప్లేసెస్ అంట. మరి ఇంకెందుకు ఆలస్యం పండుగ రోజు మీ దగ్గరిలోని గార్డెన్స్ లేదా పొలాల్లోకి వెళ్లి కైట్ ఎగరవేయండి.