ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకండి.. మీకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యాల నిధి..!
పల్లెల్లో చాలా రకాల చెట్లు, మొక్కలు కనిపిస్తాయి. కానీ, వాటిల్లో చాలా మొక్కలు మన ఆరోగ్యానికి దివ్యౌధంగా పనిచేస్తాయి. అలాంటి మొక్కల్లో నల్లేరు మొక్క కూడా ఒకటి. రోడ్ల వెంట, చెట్ల పొదల వెంట కనిపించే ఈ మొక్కను చాలా మంది పనికి రాని మొక్క అనుకొని వదిలేస్తారు. దానితో బోలేడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నల్లేరు లాభాలు తెలిస్తే ఇకమీదట ఎక్కడ కనిపించినా కూడా వదల కుండా వెంట తెచ్చేసుకుంటారు..

తీగ జాతికి చెందిన నల్లేరు మొక్కను వజ్రవల్లి, అస్థి సంహారక అని కూడా పిలుస్తారు. నల్లేరు మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది చూడటానికి చిన్న ఆకులతో కాడలతో, చాలా దట్టంగా తీగలా పెరిగి ఉంటుంది. ఈ మొక్క ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. విరిగిన ఎముకలు అతుక్కోవడానికి నల్లేరు మంచి గమ్‌లాగా పనిచేస్తుంది. తరచూ నల్లేరు తినటం వల్ల ఎముకలు బలంగా తయారు అవుతాయి. వృద్ధాప్యం వల్ల కలిగే కీళ్ల నొప్పులు, మొకాళ్ల నొప్పులకు నల్లేరు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
నల్లేరులో కాల్షియం, విటమిన్ సీ, సెలీనియం, క్రోమియం, విటమిన్ బీ, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా అంటాయి. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బరువు ఎక్కువగా ఉన్నవారు నల్లేరు మొక్క కాడలతో రసం చేసుకొని ప్రతి రోజూ తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది. ఇది డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. అలాగే దీనిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి,మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
నల్లేరులో కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సీ, కాల్షియమ్, సెలీనియమ్, క్రోమియం, విటమిన్ బి, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నల్లేరు ఎముకల దృఢత్వాన్ని పెంచటమే కండరాల శక్తిని పెంచుతుంది.. విరిగిన ఎముకలు సులభంగా అతుక్కుంటాయి. నల్లేరులో పీచు అధికంగా ఉండటం వలన పైల్స్ సమస్యను తగ్గిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








