Tips To Remove Stains: మీ చొక్కాపై మొండి మరకలు పోవడం లేదా.. ఈ చిట్కాలు ట్రై చేయండి ఈజీ..!
బట్టలపై మొండి మరకలను తొలగించటం ఇంట్లో ఆడవాళ్లకు పెద్ద సవాల్. ముఖ్యంగా కాలర్ పై పేరుకుపోయిన నల్లటి, చెమట మరకలు మరింతగా ఇబ్బంది పెడతాయి. దాంతో కాలర్ పై ఎక్కువ బలంగా రుద్దాల్సి వస్తుంది. దీంతో చొక్కా కొత్తగా ఉన్నప్పటికీ కాలర్ మాత్రం అరిగిపోతుంది. కాలర్ అరిగిపోయి, చిరిగిపోవటంతో దాన్ని పక్కకు పడేయాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యకు కొన్ని నివారణలు అద్భుతంగా ఉపయోగపడతాయి. దీంతో మీ బట్టలు మళ్లీ కొత్తగా మెరుస్తాయి. అదేలాగో ఇప్పుడు చూద్దాం...

చొక్కా కాలర్‌పై పేరుకుపోయిన మొండి మరకను తొలగించడం అంత సులభం కాదు. ఈ మరకను తొలగించడానికి, మీ శక్తినంతా ఉపయోగించి రుద్దాల్సి వస్తుంది. అలా కొన్నిసార్లు మీరు దానిని రుద్దినప్పుడు కాలర్‌పై క్లాత్ దెబ్బతిని చిరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. చొక్కా కొత్తగా ఉన్నప్పటికీ కాలర్ మాత్రమే అరిగిపోతుంది. కాలర్ అరిగిపోయి, చిరిగిపోవటంతో దాన్ని పక్కకు పడేయాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యకు కొన్ని నివారణలు అద్భుతంగా ఉపయోగపడతాయి. దీంతో మీ బట్టలు మళ్లీ కొత్తగా మెరుస్తాయి. అదేలాగో ఇప్పుడు చూద్దాం…
బేకింగ్ సోడా- వాటర్ పేస్ట్:
బేకింగ్ సోడా ఒక ప్రసిద్ధ సహజ క్లీనర్. ఇది మరకలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని కోసం, 2-3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను కొద్దిగా నీటితో కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను చొక్కా కాలర్‌పై ఉన్న చెమట మరకలపై అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత, చొక్కాను సాధారణ నీటితో సున్నితంగా రుద్ది కడగాలి. చొక్కా కాలర్‌పై ఉన్న మరక మాయమవుతుంది.
వైట్ వెనిగర్- నీరు:
చెమట మరకలను తొలగించడానికి మరొక సులభమైన పరిష్కారం వెనిగర్. ఒక టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్‌ను రెండు టేబుల్ స్పూన్ల నీటితో కలిపి మరకలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని 20-30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చొక్కాను సాధారణ సబ్బు లేదా డిటర్జెంట్‌తో వాష్ చేసుకోవాలి. . వెనిగర్‌లోని ఆమ్లం మరకలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. అలాగే, ఇది ఫాబ్రిక్ మెరుపును కాపాడుతుంది.
నిమ్మరసం- ఉప్పు:
నిమ్మకాయలో సహజ బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. ఇది మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. చొక్కా కాలర్‌పై నిమ్మరసం రాసి, దానిపై కొంచెం ఉప్పు చల్లి, కొంతసేపు అలాగే ఉంచి, ఉతకడానికి ముందు సున్నితంగా రుద్దండి. ఇది మొండి చెమట మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్- డిటర్జెంట్:
హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా పాత మరకలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఒక భాగం హైడ్రోజన్ పెరాక్సైడ్, ఒక భాగం డిటర్జెంట్ కలిపి మరకలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చొక్కా ఉతకండి. ఇది పాత, నల్లటి మరకలను కూడా సులభంగా తొలగిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








