నిటారుగా నిలబడి బుసలు కొడుతున్న నాగుపాము.. పడగలో అరుదైన నాగమణి.. దూరం నుండి చూసినా..
కొన్నిసందర్భాల్లో పాములకు సంబంధించిన అరుదైన దృశ్యాలు కూడా ఇంటర్నెట్ ప్రజల్ని షాక్ అయ్యేలా చేస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇందులో అరుదైన నాగమణి ధరించి ఉన్న నాగుపాము భయంకరంగా బుసలు కొడుతూ భయపెడుతోంది...వైరల్ అవుతున్న ఈ వీడియోను Serpent Shorts అని యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించారు.

ప్రతిరోజూ సోషల్ మీడియాలో వందలు వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో పాములకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. స్నేక్ క్యాచర్లు కొంతమంది పాములను పట్టుకుంటున్న సమయంలో వారికి ఎదురయ్యే సవాళ్లు, చేసే సాహసం గురించి, పాములను వదిలిపెడుతున్న సందర్భాల్లో తీస్తున్న వీడియోలు కూడా తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అంతేకాకుండా, కొన్నిసందర్భాల్లో పాములకు సంబంధించిన అరుదైన దృశ్యాలు కూడా ఇంటర్నెట్ ప్రజల్ని షాక్ అయ్యేలా చేస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇందులో అరుదైన నాగమణి ధరించి ఉన్న నాగుపాము భయంకరంగా బుసలు కొడుతూ భయపెడుతోంది…
వైరల్ అవుతున్న నాగుపాము వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంది. కేవలం 6 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో ఓ అరుదైన కింగ్ కోబ్రా బుసలు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోలో ఒక భారీ నాగుపాము బహిరంగ ప్రదేశంలో నిటారుగా నిలబడి.. పడగవిప్పి కనిపిస్తోంది..చూస్తుంటే, అది కోపంతో ఉందని తెలుస్తుంది.. బుసలు కొడుతూ ఎదుటి వారి మీదకు దూసుకు వస్తోంది.. ఆ బుసల శబ్ధం కూడా భయంకరంగా వినిపిస్తోంది. అయితే, ఇక్కడ మరో ఆశ్చర్యకర అంశం ఉంది.. నాగుపాము పడక విప్పిన సందర్భంలో ఆ పడగలో అరుదైన నల్లటి రంగులో వజ్రం మెరుస్తూ కనిపిస్తుంది. దీనిని చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఇది అరుదైన నాగమణిగా భావిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
వైరల్ అవుతున్న ఈ వీడియోను Serpent Shorts అని యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించారు. అంతేకాకుండా కొంతమంది ఈ వీడియోని షేర్ కూడా చేశారు. ఆరు సెకండ్ల ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈ పాము పడగ భాగంలో కనిపిస్తున్న అరుదైన కాంతివంతమైన నలుపు రంగులో ఉన్న వజ్రాన్ని చూసి మరింతగా ఆశ్చర్యపోతున్నారు. ఈ పాము మహాశక్తులు కలిగినదిగా భావిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




