AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: స్టైల్‌ మార్చిన దుబాయ్‌ పోలీస్‌..! రద్దీగా ఉండే మార్కెట్లలో గస్తీ చూస్తే..

సోషల్ మీడియాలో గుర్రాలపై గస్తీ కాస్తున్న పోలీసులు వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇది మన దేశంలో కాదండోయ్.. వీడియో దుబాయ్‌కి చెందినదిగా తెలిసింది. దుబాయ్‌లో అత్యంత రద్దీగా ఉండి ఎప్పుడూ సందడిగా ఉండే నైట్ మార్కెట్‌లో పోలీసులు గుర్రాలపై గస్తీ తిరుగుతున్న దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఒక భారతీయ పర్యాటకుడు చిత్రీకరించిన ఈ క్లిప్, క్రమశిక్షణను కాపాడుకోవడంలో ఆ దళం అనుసరిస్తున్న సంప్రదాయం, ఆధునికత కలగలిపి నిర్వహించటం హైలైట్ చేస్తుంది.

Watch: స్టైల్‌ మార్చిన దుబాయ్‌ పోలీస్‌..! రద్దీగా ఉండే మార్కెట్లలో గస్తీ చూస్తే..
Dubai Police
Jyothi Gadda
|

Updated on: Nov 01, 2025 | 2:02 PM

Share

దుబాయ్ పోలీసు అధికారులు గుర్రంపై రద్దీగా ఉండే షాపింగ్ సెంటర్లలో గస్తీ తిరుగుతున్న వీడియోని ఒక భారతీయ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సోషల్ మీడియా యూజర్ శ్రుతి షెండే పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఇద్దరు పోలీసులు రాత్రిపూట రద్దీగా ఉండే మార్కెట్ వీధుల్లో గుర్రాలపై తిరుగుతూ గస్తీ కాస్తున్నారు. హై విజిబిలిటీ జాకెట్లు ధరించి, ప్రకాశవంతమైన లైట్లు, దుకాణాలు, వ్యాపారులు, ప్రజలతో నిండిన ఇరుకైన మార్గాల్లో జాగ్రత్తగా ప్రయాణిస్తుండటం కనిపిస్తుంది. ఈ వీడియో దుబాయ్ పోలీసుల ప్రత్యేకమైన పెట్రోలింగ్ శైలిని చూపిస్తుంది. ఇది ప్రజల భద్రతను స్టైల్‌గా నిర్ధారిస్తుంది.

ఈ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ట్రాఫిక్ సమయంలో దుబాయ్ పోలీసులు షాపింగ్‌ను ఇలా తనిఖీ చేస్తున్నారు.. వీధుల్లో గుర్రంపై ఉన్న ఈ రాజులకు నమస్కరిస్తారు” అని క్యాప్షన్ ఇచ్చారు. రీల్‌లోని టెక్స్ట్ ఇలా ఉండగా, దుబాయ్ పోలీసులు షాపింగ్‌ సెంటర్లను ఎలా తనిఖీ చేస్తారు అని ఉంది. ఈ వీడియోకు వేల సంఖ్యలో లైక్‌లు, అనేక కామెంట్లు వచ్చాయి. దుబాయ్ పోలీసుల ప్రత్యేక శైలిని నెటిజన్లు ప్రశంసించగా, కొందరు గుర్రాల శ్రేయస్సు గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో shruti_dxbrealtor అనే IDతో షేర్ చేయబడింది. దీనిని ఇప్పటివరకు 3 లక్షల 76 వేలకు పైగా చూశారు. 10 వేలకు పైగా ప్రజలు ఈ వీడియోను లైక్ చేసి తమదైన స్టైల్లో భిన్నమైన కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..