AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“సెల్యూట్ సోదరా”.. ఈ డెలివరీ బాయ్ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..!

నేటి ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ సౌలభ్యం, సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ రోజుల్లో, తమ పరిమితులను బలాలుగా మార్చుకునే వారు కొందరు ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. లక్షలాది మంది హృదయాలను తాకింది. ఈ వీడియో చూసిన వెంటనే మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది.

సెల్యూట్ సోదరా.. ఈ డెలివరీ బాయ్ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..!
Disabled Food Delivery Boy
Balaraju Goud
|

Updated on: Nov 01, 2025 | 6:57 PM

Share

నేటి ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ సౌలభ్యం, సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ రోజుల్లో, తమ పరిమితులను బలాలుగా మార్చుకునే వారు కొందరు ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. లక్షలాది మంది హృదయాలను తాకింది. ఈ వీడియోలో ఒక డెలివరీ బాయ్ ట్రైసైకిల్‌పై కస్టమర్లకు ఆహారాన్ని డెలివరీ చేస్తూ కనిపించారు. కానీ ఈ కథ అతని జీవన పోరాటంలో మాత్రమే కాదు, ప్రతి డెలివరీతో ప్రకాశించే చిరునవ్వులో దాగిఉంది. ఈ వీడియో చూసిన వెంటనే మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది.

వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి ఒక ప్రధాన నగరంలో ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా పని చేస్తున్నాడు. అతను శారీరకంగా వైకల్యం ఉన్నప్పటికీ, ట్రైసైకిల్‌పై ప్రజల ఇళ్లకు వెళ్లి ఆర్డర్లు అందిస్తున్నాడు. ఈ వీడియో ఒక కస్టమర్ తన అపార్ట్‌మెంట్ నుండి ఆహారం ఆర్డర్ చేయడంతో ప్రారంభమవుతుంది. డెలివరీ బాయ్ కిందికి చేరుకున్న వెంటనే, “సార్, దయచేసి కిందకి రండి, నేను పైకి రాలేను” అని ఫోన్ ద్వారా కాల్ చేశాడని కస్టమర్ వివరించాడు. డెలివరీ బాయ్ మొదట అలసిపోయి ఉంటాడని కస్టమర్ అనుకుంటాడు. కానీ కిందికి చేరుకున్నప్పుడు, అతని ముందు కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. డెలివరీ బాయ్ కష్టపడి పనిచేయడం చూసి కస్టమర్ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఈ వీడియోలో దివ్యాంగుడైన డెలివరీ బాయ్ ఒక ట్రైసైకిల్ మీద కూర్చుని అర్డర్ ఇవ్వడానిక వచ్చాడు. ఇది సాధారణంగా వికలాంగుల కోసం తయారు చేసిన రకం. అతను ఒక ఆహార ప్యాకెట్ తీసుకుని నవ్వుతూ పలకరించాడు. కస్టమర్ భావోద్వేగంతో, “సోదర, మీరు చాలా బాగా కష్టపడి పని చేస్తున్నారు. ఇలాగే కొనసాగించండి” అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇది విన్న డెలివరీ బాయ్ నవ్వి, “ఇది దేవుని దయ” అని అంటూ.. తెచ్చిన పార్సిల్ అందించి వెళ్లిపోయాడు.

wandererrocky అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ వీడియో మిలియన్ల కొద్దీ వీవ్స్, అనేక లైక్‌లను సంపాదించింది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు “ఈ సోదరుడికి సెల్యూట్” అని రాశారు. మరొకరు “పని చేయాల్సిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని చేస్తారు” అని రాశారు. మరొక వినియోగదారుడు “ఈ సోదరుడు నా రోజును మార్చాడు” అని పేర్కొన్నాడు.

వీడియో చూడండి.. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..