AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uric Acid Diet: ఈ 3 పండ్లు రోజూ తింటే.. మీ ఒంట్లో యూరిక్‌ యాసిడ్‌ చిటికెలో హాంఫట్!

Which fruits can reduce uric acid: ఆఫీసు భోజనం అయినా, స్నేహితులతో కేఫ్ లలో లేదా రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్ లో ఎక్కడ ఉన్నా వేడివేడిగా పరాఠాలు, సమోసా వంటి వివిధ స్ట్రీట్‌ ఫుడ్‌ రుచులు తెగ ఆస్వాదిస్తుంటారు. ఫలితంగా శరీరంలో యూరిక్ యాసిడ్ ప్రభావాలు కనిపిస్తుంటాయి. ప్రారంభంలో చాలా మంది ఈ యూరిక్ యాసిడ్..

Uric Acid Diet: ఈ 3 పండ్లు రోజూ తింటే.. మీ ఒంట్లో యూరిక్‌ యాసిడ్‌ చిటికెలో హాంఫట్!
These Fruits Can Reduce Uric Acid
Srilakshmi C
|

Updated on: Nov 04, 2025 | 1:57 PM

Share

నేటి కాలంలో దాదాపుగా చాలా మంది ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడ్డారు. ఆఫీసు భోజనం అయినా, స్నేహితులతో కేఫ్ లలో లేదా రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్ లో ఎక్కడ ఉన్నా వేడివేడిగా పరాఠాలు, సమోసా వంటి వివిధ స్ట్రీట్‌ ఫుడ్‌ రుచులు తెగ ఆస్వాదిస్తుంటారు. ఫలితంగా శరీరంలో యూరిక్ యాసిడ్ ప్రభావాలు కనిపిస్తుంటాయి. ప్రారంభంలో చాలా మంది ఈ యూరిక్ యాసిడ్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో పాదాల అరికాళ్ళు, మోకాలు, మోచేతులలో నొప్పి మొదలవుతుంది. ఎక్కువసేపు కూర్చుంటే పాదాలు కూడా ఉబ్బుతాయి. ఇక్కడే ఆర్థరైటిస్ కూడా మొదలవుతుంది. యూరిక్ యాసిడ్ ను ప్రారంభంలోనే నివారించగలిగితే మనుముందు సమస్యలను పూర్తిగా అణచివేయవచ్చని వైద్యులు అంటున్నారు. లేదంటే సమస్య పెరుగుతుంది. ఇది మొదట నొప్పితో ప్రారంభమైనప్పటికీ యూరిక్ యాసిడ్ మూత్రపిండాలు, గుండెకు మీద కూడా తీవ్ర ప్రభావాలు చూపుతుంది.

యూరిక్ యాసిడ్ లక్షణాలు గుర్తించినప్పుడు సాధారణంగా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. పాలకూర, టమోటాలు, పప్పులు, మాంసం, చేప నూనె, కాఫీ, కేకులు, వీటిని అస్సలు తినకూడదు. అయితే మూడు రకాల పండ్లు మాత్రం ఖచ్చితంగా తినాలి. వీటిని క్రమం తప్పకుండా తింటే, అవి మ్యాజిక్‌లా పనిచేస్తాయి. ఒంట్లో యూరిక్ యాసిడ్ వేగంగా తగ్గుతుంది.

చెర్రీస్

చెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర నొప్పులను తగ్గిస్తుంది. అంతే కాదు ఈ పండు యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మకాయ

విటమిన్ సి యూరిక్ యాసిడ్ కు పెద్ద శత్రువు. శరీరంలో విటమిన్ సి స్థాయి పెరిగినప్పుడు యూరిక్ యాసిడ్ మ్యాజిక్‌లా తగ్గుతుంది. కాబట్టి నారింజ, నిమ్మకాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఫలితంగా యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గడం మీరు గమనిస్తారు.

యాపిల్స్

విటమిన్ సి మాత్రమే కాదు. యూరిక్ యాసిడ్ తగ్గించడంలో విటమిన్ ఎ కూడా గొప్పగా పనిచేస్తుంది. ఈ విషయంలో ఆపిల్స్ సరైన పండు. ఆపిల్స్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం వల్ల యూరిక్‌ యాసిడ్ కూడా దూరంగా ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి