AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: సర్కార్‌ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో

Srikakulam tribal ashram school Teahcer issue: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక్కడి ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Watch Video: సర్కార్‌ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
Srikakulam School Teacher Massaging Feet With Students
Srilakshmi C
|

Updated on: Nov 04, 2025 | 11:34 AM

Share

శ్రీకాకుళం, నవంబర్‌ 4: లోకం తెలియని పిల్లలకు అన్నీ తామై విద్యా బుద్దులు నేర్పి వారిని ప్రయోజకులుగా మార్చడంలో టీచర్లదే సింహ భాగం. నైతిక విలువలతోపాటు చదువు ఒంటబట్టేలా చేసి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా బాలలను తీర్చిదిద్దే అనితర బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. కానీ నేటి కాలంలో టీచర్లలో అంకిత భావం కరువైంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం నానాటికీ నేల చూపులు చూస్తుంది. అందుకు కారణం.. కొందరు టీచర్లు కేవలం జీతాల కోసం మాత్రమే మొక్కుబడిగా పాఠశాలలకు రావడం.

ఇలాంటి బాధ్యతారహితమైన ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి టేబుల్‌పై పడి గుర్రుపెట్టి నిద్రపోవడం, పిల్లలతో తల దువ్వించడం, పేలు చూపించడం, వారితో ఇతర పనులు చేయిస్తున్నారు. అడపా దడపా ఇలాంటి సంఘటనలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోమారు శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ టీచర్మ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి బదులు వీధి రౌడీలా కుర్చీలో కూర్చుని పిల్లలతో కాళ్లు పట్టించుకుంది. కుర్చీ వెనక్కి వాలి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ విలాసవంతంగా సమయం గడపసాగింది. ఇద్దరు విద్యార్థినులతో చెరొక కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. సదరు వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈఘటన పై ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఉపాధ్యాయురాలికి ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేశామని, విచారణకు ఆదేశించామన్నారు. మరో వైపు ఆ ఉపద్యాయురాలు మాత్రం కాలుబెనికింది విద్యార్థులు సహాయం చేస్తున్నారని చెప్పుకురావడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఇక ఈ వీడియో చూసిన జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిఘా కరువవడం వల్లనే ఉపాధ్యాయులు మరింతగా బరితెగిస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.