AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakshi Festival: నోరూరిస్తున్న రాఖీలు.. కొనుగోలు కోసం పోటీపడుతున్న అక్కాచెల్లెళ్లు.. వీటి స్పెషాలిటీ ఏమిటంటే..

సాధరణంగా రాఖీలు పేపర్ తోనూ లేదా ప్లాస్టిక్ తోనూ చేస్తుంటారు. మరికొన్ని చోట్ల ప్రకృతి ప్రేమికులు చెట్ల బెరుడు, ఆకులతో రాఖీలు చేసి తమకు ప్రకృతి పట్ల ఉన్న ప్రేమను చాటుకుంటుంటారు. అయితే ఆ పట్టణంలో దొరికే రాఖీలు మాత్రం చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరి నోరూరిస్తున్నాయి. రాఖీ ఏంటీ నోరూరించడం ఏంటా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాకు వెళ్ళాలసిందే.. 

Rakshi Festival: నోరూరిస్తున్న రాఖీలు.. కొనుగోలు కోసం పోటీపడుతున్న అక్కాచెల్లెళ్లు.. వీటి స్పెషాలిటీ ఏమిటంటే..
Sweets Rakhis
T Nagaraju
| Edited By: |

Updated on: Aug 31, 2023 | 11:28 AM

Share

అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ బంధన్.. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు మధ్య ప్రేమ అనురాగాలకు గుర్తుగా రాఖీ పండుగ జరుపుకుంటుంటారు. రాఖీ పండుగ రోజు సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టి వారి ఆశీర్వాదం తీసుకుంటుంటారు. సాధరణంగా రాఖీలు పేపర్ తోనూ లేదా ప్లాస్టిక్ తోనూ చేస్తుంటారు. మరికొన్ని చోట్ల ప్రకృతి ప్రేమికులు చెట్ల బెరుడు, ఆకులతో రాఖీలు చేసి తమకు ప్రకృతి పట్ల ఉన్న ప్రేమను చాటుకుంటుంటారు. అయితే ఆ పట్టణంలో దొరికే రాఖీలు మాత్రం చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరి నోరూరిస్తున్నాయి. రాఖీ ఏంటీ నోరూరించడం ఏంటా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాకు వెళ్ళాలసిందే..

తెనాలిలో చాక్లెట్ రాఖీలను తయారు చేస్తున్నారు. చూడటానికి అందంగా కనిపించడమే కాదు తింటే తియ్యగా కూడా ఉంటాయి. పట్టణానికి చెందిన లావణ్యకు వచ్చిన ఆలోచనలోనుండి పుట్టుకొచ్చిందే ఈ చాక్లెట్ రాఖీ… రాఖీ పండుగను ఎక్కువుగా చిన్న పిల్లలు జరుపుకుంటుంటారు. అదే విధంగా రాఖీ కట్టిన తర్వాత స్వీట్స్ పంచుకోవడం కూడా జరగుతుంటుంది. ఈ నేపధ్యంలోనే లావణ్య రాఖీలను చాక్లెట్స్ రూపంలో ఎందుకు తయారు చేయకూడదని అనుకున్నారు. అనుకున్నది తడువుగానే చాక్లెట్ రాఖీలను తయారు చేయడం మొదలు పెట్టారు. వాటికి డిమాండ్ కూడా బాగానే ఉండటంతో విక్రయించడం మొదలు పెట్టారు.

గత కొన్నేళ్లుగా చాక్లెట్ రాఖీలను తయారు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ముందుగా ఆర్డర్ ఇస్తే మన పేరు మీద కూడా ఈ రాఖీలను తయారు చేస్తున్నారు. చూడటానికి అందంగా ఉండటమే కాకుండా తినడానికి కూడా రుచిగా ఉంటున్నాయి. దీంతో చిన్నా పెద్దా అన్నా తేడా లేకుండా వీటిని కొనుగోలు చేస్తున్నారు. స్వీట్స్ కు బదులుగా ఈ రాఖీ చాక్లెట్స్ కొనుగోలు చేసి వాటిని పంచుకుంటున్నారు. తెనాలిలో అనేకమంది వీటికి షాపుల వద్ద క్యూ కడుతున్నారు కూడా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..