AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident: మల్లన్న ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. 14 దుకాణాలు దగ్ధం.. సుమారు రెండు కోట్లమేర ఆస్థి నష్టం..

దుకాణాల సముదాయంలో ఎల్ బ్లాక్ లో సుమారు 12 దుకాణాలు మంటలతో పూర్తిగా దగ్దమయ్యాయి. ఎల్ బ్లాక్ ఓ దుకాణంలో చెలరేగిన షార్ట్ సర్క్యూట్ తో ఒకదానికొకటి వ్యాపించడంతో పక్కనే ఉన్న దుకాణదారులు ఫోన్ ద్వారా విద్యుత్ శాఖకు ఫోన్ చేసి విద్యుత్ ను నిలిపివేశారు. అప్పటికే సుమారు 14 బొమ్మలు, గాజులు, దేవుడి ఫోటోల దుకాణాలకు మంటలు వ్యాపించాయి.

Fire Accident: మల్లన్న ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. 14 దుకాణాలు దగ్ధం.. సుమారు రెండు కోట్లమేర ఆస్థి నష్టం..
Fire Accident In Srisailam
J Y Nagi Reddy
| Edited By: Surya Kala|

Updated on: Aug 31, 2023 | 7:27 AM

Share

ప్రముఖ శివ క్షేత్రం.. ద్వాదశగా జ్యోతిర్లింగాల్లో ఒకటైన  శ్రీశైల క్షేత్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మల్లన్న ఆలయ సమీపంలోని లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. దుకాణాల సముదాయంలో ఎల్ బ్లాక్ లో సుమారు 14 దుకాణాలు మంటలతో పూర్తిగా దగ్దమయ్యాయి. ఎల్ బ్లాక్ ఓ దుకాణంలో చెలరేగిన షార్ట్ సర్క్యూట్ తో ఒకదానికొకటి వ్యాపించడంతో పక్కనే ఉన్న దుకాణదారులు ఫోన్ ద్వారా విద్యుత్ శాఖకు ఫోన్ చేసి విద్యుత్ ను నిలిపివేశారు. అప్పటికే సుమారు 14 బొమ్మలు, గాజులు, దేవుడి ఫోటోల దుకాణాలకు మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసి పూర్తిగా అగ్నికి ఆహుతైనాయి. మంటలు చెలరేగిన సంఘటన స్థలానికి హుటాహుటిన దేవస్థానం వాటర్ ట్యాంక్, ఫైర్ ఇంజన్, దేవస్థానం ఈవో లవన్న సిబ్బంది కలిసి మంటలను అదుపు చేశారు. అప్పటికే 14 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణాల దగ్ధంతో 14 దుకాణాలలో సుమారు 1 కోటి నుండి 2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని దుకాణదారులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కాలంలోనే ఆలయానికి ప్రధానంగా ఉన్న దుకాణాలను లలితాంబికా దుకాణాల్లోకి బహిరంగ వేలం ద్వారా దుకాణాలను తరలించడం జరిగింది. సుమారు లలితాంబిక దుకాణాల సముదాయంలో 220 వరకు దుకాణాలున్నాయి. ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగి 14 దుకాణాలు మంటలకు ఆహుతి కావడంతో దుకాణదారుల్లో భయం మొదలైంది. లలితాంబికా దుకాణాల్లో చివరి బ్లాకులో మంటలు తెలరేగడంతో 14 షాపుల వరకే మంటలు వ్యాపించాయి. అదే లలితాంబికా కాంప్లెక్స్ లో మరోచోట అయ్యుంటే ఊహించని నష్టం జరిగి ఉండేదని వ్యాపారస్తులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..