AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandhrababu: దసరా రోజు ఎన్నికల మేనిఫెస్టో.. మహిళల కోసం మహా శక్తి కార్యక్రమం ప్రకటించిన చంద్రబాబు

ఆడబిడ్డలకు అండగా ఉంటామన్న చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆడబిడ్డ పేరతో పెళ్లి కానుక ఇచ్చింది తమ పార్టీ అని చంద్రబాబు గుర్తు చేశారు. ఆనాడు ఆడబిడ్డలు కష్టపడకూడదనే దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మహళల భవిష్యత్‌కు మహాశక్తి పథకం తోడ్పుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళలను ఆర్థికంగా స్థిరపరిచేందుకు తాము అన్ని వేళలా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. దసరా రోజు మహిళల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.

Chandhrababu: దసరా రోజు ఎన్నికల మేనిఫెస్టో.. మహిళల కోసం మహా శక్తి కార్యక్రమం ప్రకటించిన చంద్రబాబు
Chandrababu
Sanjay Kasula
|

Updated on: Aug 31, 2023 | 7:35 AM

Share

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను దసరా రోజున విడుదల చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. అది కూడా మహిళల సమక్షంలో ఉంటుందన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు విషయాలను వెళ్లడించారు. మహిళా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు చంద్రబాబు. మేనిఫెస్టోలోనూ మహిళాభ్యున్నతికే తమ పార్టీ ప్రధానం ఇస్తుందన్నారు.

ఆడబిడ్డలకు అండగా ఉంటామన్న చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆడబిడ్డ పేరతో పెళ్లి కానుక ఇచ్చింది తమ పార్టీ అని చంద్రబాబు గుర్తు చేశారు. ఆనాడు ఆడబిడ్డలు కష్టపడకూడదనే దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మహళల భవిష్యత్‌కు మహాశక్తి పథకం తోడ్పుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళలను ఆర్థికంగా స్థిరపరిచేందుకు తాము అన్ని వేళలా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. దసరా రోజు మహిళల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.

మహిళలను శక్తిమంతులను చేయడమే తెలుగు దేశం పార్టీ లక్ష్యమన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే తాను ఆత్మవిశ్వాసం ఇచ్చాన్నారు. తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని సంకల్పం చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో కరెంట్ చార్జీలు పెంచమని స్పష్టం చేశారు చంద్రబాబు.

అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే తల్లికి వందనం పేరుతో పిల్లలందరి చదువుకు ఆర్థిక చేస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఏటా రూ.15వేలు ఇస్తామన్నారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పేద కుటుంబాలకు ఏటా 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని.. అవసరమైతే మరో సిలిండర్‌ కూడా ఉచితంగా ఇచ్చేందుకు రెడీగా ఉన్నామన్నారు. పీ-4 పేరుతో.. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అన్నింటిని కలపి ఓ కార్యక్రమంగా మార్చుతామన్నారు. ప్రస్తుత మన వద్ద ఉన్నవాటితో ధనికుడు మరింత ధనికుడిగా మారుతున్నాడని.. పేదవాడు మరింత పేదరికంలోకి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మొదటి విడత మేనిఫెస్టో ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం