Thursday Puja Tips: గురువారం పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. చేస్తే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..

చాలా మంది ప్రజలు తాము ఏ శుభ కార్యాలను మొదలు పెట్టాలన్నా  గురువారం ఎంపిక చేసుకుంటారు. హిందూ విశ్వాసం ప్రకారం  గురువారం కొన్ని కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తి విధి తారుమారు అవుతుంది. సుఖ సంతోషాలు కలగాలన్నా.. దుఃఖం, అరిష్టాలు తొలగన్నా గురువారం పొరపాటున కూడా ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.

Thursday Puja Tips: గురువారం పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. చేస్తే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..
Thursday Tips
Follow us
Surya Kala

|

Updated on: Aug 31, 2023 | 11:02 AM

హిందూ సనాతన సంప్రదాయంలో గురువారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ రోజున ఆనందాన్ని, అదృష్టాన్ని పెంచే బృహస్పతిని పూజిస్తారు. ఈ రోజున ప్రపంచాన్ని పోషించే విష్ణువును పూజించే సంప్రదాయం కూడా ఉంది. చాలా మంది ప్రజలు తాము ఏ శుభ కార్యాలను మొదలు పెట్టాలన్నా  గురువారం ఎంపిక చేసుకుంటారని.. ఇందుకు కారణం ఇదేనని అంటారు. హిందూ విశ్వాసం ప్రకారం  గురువారం కొన్ని కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తి విధి తారుమారు అవుతుంది. సుఖ సంతోషాలు కలగాలన్నా.. దుఃఖం, అరిష్టాలు తొలగన్నా గురువారం పొరపాటున కూడా ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.

  1. హిందూ విశ్వాసం ప్రకారం గురువారం రోజున పసుపు బట్టలు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు ఇలా చేయలేకపోతే, కనీసం లేత రంగు దుస్తులు ధరించండి. ముదురు, నలుపు రంగుల దుస్తులను ధరించకూడదు. అంతేకాదు హిందూ విశ్వాసం ప్రకారం ఎవరైనా సరే గురువారం నల్ల బట్టలు ధరిస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి.
  2. హిందువుల విశ్వాసం ప్రకారం గురువారం జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. హిందూ విశ్వాసం ప్రకారం  ఈ రోజున జుట్టు లేదా గోర్లు కత్తిరించడం వలన నీలాపనిందలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కారణంగా ఒక వ్యక్తి  ఆనందం, అదృష్టం దూరమవుతుంది.
  3. హిందూ విశ్వాసం ప్రకారం గురువారం రోజున బట్టలు ఉతకరాదు. జుట్టుకు షాంపూ చేయకూడదు. ముఖ్యంగా మహిళలు తలంటుకోవడం మానుకోవాలి. ఈ నియమాన్ని విస్మరిస్తే జాతకంలో బృహస్పతి బలహీనంగా మారుతుందని నమ్ముతారు. ఇది వివాహం, సంతానం పురోగతి, అదృష్టాన్ని తగ్గిస్తుంది.
  4. గురువారం బృహస్పతికి అంకితం చేయబడింది. హిందూ విశ్వాసం ప్రకారం గురువారం రోజున ఒక వ్యక్తి తన గురువుకు సేవ చేసి, గౌరవిస్తే, సంతోషం, అదృష్టం పొందుతాడు. అయితే అతను తన గురువును బాధించినా లేదా అవమానించినా దురదృష్టాన్ని పొందుతాడు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు పొరపాటున కూడా మీ గురువును అవమానించకండి.
  5. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున ఇంట్లోని సాలెపురుగులను శుభ్రం చేయడం, తుడుచుకోవడం నిషిద్ధం. హిందూ విశ్వాసం ప్రకారం ఈ నియమాన్ని విస్మరించిన వ్యక్తి సంపద అతని ఇంటి నుండి తుడిచిపెట్టబడుతుంది. అతను ఎంత సంపాదించినా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఉంటాడు.
  6. హిందూ మతంలో గురువారం నాడు బృహస్పతి, విష్ణువుకు పసుపు పువ్వులు, పసుపు పండ్లను సమర్పించే సంప్రదాయం ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం బృహస్పతి భగవంతుడు నివసించే అరటి చెట్టుని కొట్ట రాదు. అంతేకాదు అరటి పండు గురువారం తినకూడదు. ఎందుకంటే ఈ రోజున అరటి పండుని ప్రత్యేకంగా పూజిస్తారు.
  7. గురువారం నాడు ఎలాంటి పనులు చేయకుండా ఉండడంతో పాటు ప్రయాణానికి సంబంధించిన నిబంధనలను కూడా పాటించాలి. పంచాంగం ప్రకారం ఈ దిశలో నిర్జన ప్రదేశం ఉన్నందున గురువారం దక్షిణం వైపు ప్రయాణించకూడదు. అటువంటి పరిస్థితిలో తప్పుదారి పట్టకుండా ఉండటానికి, వీలైనంత వరకు ఈ దిశలో ప్రయాణించకుండా ఉండడం మేలు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)