AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంటి ముందు పసుపు నీరు చల్లడం, గడపకు పసుపు రాయడం వెనుక వాస్తు నియమాలతో పాటు శాస్త్రీయ కోణం ఉందని మీకు తెలుసా..

పసుపు-కుంకుమలి దేవుడి పూజలో  విశిష్ట స్థానం ఉంది. భారతదేశంలోని హిందూ సంస్కృతి ప్రకారం పూజ ప్లేట్‌లో పసుపు-కుంకుమ ఉంటుంది. అయితే పసుపుని కొన్ని ఏళ్ల క్రితం వరకూ ఇంటిలోని పెద్దలు నీటిలో కలిసి ఇల్లంతా చల్లి శుద్ధి చేశామని భావించేవారు.. ఇలా చేయడానికి కూడా కొన్ని కారణాలున్నాయని అంటున్నారు. ఇంట్లో సిరి సంపదలను  శ్రేయస్సును పెంచడంలో పసుపు ప్రాముఖ్యత చాలా ఉందని అంటున్నారు.

Vastu Tips: ఇంటి ముందు పసుపు నీరు చల్లడం, గడపకు పసుపు రాయడం వెనుక వాస్తు నియమాలతో పాటు శాస్త్రీయ కోణం ఉందని మీకు తెలుసా..
Vastu Tips With Turmeric
Surya Kala
|

Updated on: Sep 01, 2023 | 8:15 AM

Share

హిందూ సంప్రదాయంలో పూజకు.. పూజా సమయంలో ఉపయోగించే వస్తువులకు ప్రముఖ స్థానం ఉంది. పసుపుని పూజ, శుభకార్యాల్లో ఉపయోగించడమే కాదు.. వంటింట్లో వస్తువుల్లో కూడ ప్రముఖ స్థానం ఉంది. పసుపులో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అంతేకాదు పసుపుతో కొన్ని వాస్తు పరిష్కారాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు వాస్తు శాస్త్రం చెప్పేవారు. పసుపు-కుంకుమలి దేవుడి పూజలో  విశిష్ట స్థానం ఉంది. భారతదేశంలోని హిందూ సంస్కృతి ప్రకారం పూజ ప్లేట్‌లో పసుపు-కుంకుమ ఉంటుంది. అయితే పసుపుని కొన్ని ఏళ్ల క్రితం వరకూ ఇంటిలోని పెద్దలు నీటిలో కలిసి ఇల్లంతా చల్లి శుద్ధి చేశామని భావించేవారు.. ఇలా చేయడానికి కూడా కొన్ని కారణాలున్నాయని అంటున్నారు. ఇంట్లో సిరి సంపదలను  శ్రేయస్సును పెంచడంలో పసుపు ప్రాముఖ్యత చాలా ఉందని అంటున్నారు. ఈ రోజు పసుపుకి ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

పసుపు నీటితో ఇంటితో పాటు లాకర్ ను సుద్ధి చేయడం..

ఎపుడైనా ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు పెరిగితే పరిష్కారం కోసం ఒక రాగి గిన్నెలో నీటిని తీసుకుని అందులో పసుపు వేసి ఆ నీటిని ఇంటిలో చల్లుతారు. అంతేకాదు ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఈశాన్య దిశలో ఆ రాగి చెంబుని పసుపు నీటితో పాటు పువ్వు వేసి ఉంచుతారు. ఇలా చేయడం వలన ఇంటిలో సభ్యులకు శుభం కలుగుతుందని నమ్మకం.

కొంతమంది ఇంటి ప్రవేశద్వారం వద్ద పసుపుతో స్వస్తిక చిహ్నాన్ని వేస్తారు. ఇలా చేయడం వలన సంతోషంగా ఉంటామని విశ్వాసం.. అంతేకాదు వాస్తు దోషాలు నయం అవుతాయి. పసుపు, స్వస్తిక్ రెండూ పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ దేవిని సంతోషపడుతుందని విశ్వాసం. పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది.. ఇంట్లో ఎలాంటి వాస్తుదోషం లేకుండా చేస్తుంది. మీ ఇంటి ప్రవేశ ద్వారం కుడివైపున స్వస్తిక చిహ్నాన్ని గీయాలి. అయితే ఇలా ఉపయోగించే పసుపుని వంటలో ఉపయోగించకూడదు. స్వస్తికను గీయడానికి ముందు మీ చేతులు శుభ్రంగా ఉండాలి. స్వస్తిక్ అన్ని కోణాలు సమానంగా ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

కొంతమంది తమ ఇంటి ముందు నీటిని చల్లడానికి ఆ నీటిలో ఆవుపేడను వినియోగిస్తే.. మరికొందరు ఆ నీటిలో పసుపు కలుపుతారు. ఇలా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీటిని చల్లడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని విశ్వాసం.  అంతేకాదు శాస్త్రీయ కోణంలో పసుపు సూక్ష్మజీవులను నశింప జేస్తుంది. పసుపు గడపకు రాయడం వలన కూడా ఆరోగ్య సంబంధిత రీజన్స్ ఉన్నాయని అంటారు

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్