AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pineapple Fried Rice: రెగ్యులర్ ఆహారం తిని బోర్ కొట్టిందా..! థాయి స్పెషల్ పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి.. రెసిపీ ఏమిటంటే

వెజ్ తినేవారు లేదా నాన్ వెజ్ ప్రియులు ఇలా ఎవరికైనా సరే బిర్యానీ అంటే చాలు నోరూరుతుంది. ఆదివారం సహా ప్రత్యేక సందర్భాల్లో రకరకాల బిర్యానీలను తినడానికి ఇష్టపడతారు. అయితే మీకు ఇష్టమైన బిర్యానీ మర్చిపోండి. థాయి వంటకాల్లో ఒకటైన పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ని ట్రై చేయండి. పైనాపిల్ ముక్కలను వేయించిన అన్నంలో కలిపి తయారు చేసే ఒక రుచికరమైన వంటకం. తీపి, పులుపు, కారపు రుచుల కలయికతో ఉండే పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ మీ కోసం

Pineapple Fried Rice: రెగ్యులర్ ఆహారం తిని బోర్ కొట్టిందా..! థాయి స్పెషల్ పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి.. రెసిపీ ఏమిటంటే
Pineapple Fried Rice
Surya Kala
|

Updated on: Jul 23, 2025 | 3:28 PM

Share

బిర్యానీ అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే.. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే బిర్యానీతో పోటీపడే ఆహారం లేదంటే అతిశయోక్తి లేదు. అయితే మీకు ఇష్టమైన బిర్యానీతో పోటీ పడే పైనాపిల్ ఫ్రైడ్ రైస్ గురించి మీకు తెలుసా. ఇది మసాలా రుచితో పాటు తీపి, కారం కలయిక. ఈ పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ని తయారు చేయడం చాలా సులభం. రుచికరమైనది. ప్రతి ఆహార ప్రియుడి హృదయాన్ని గెలుచుకునే ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాన్ని కొన్ని నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చో. ఈ రోజు పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు:

  1. బాస్మతి రైస్ – 2 కప్పులు(ఉడికించినవి)
  2. తాజా పైనాపిల్ (చిన్న ముక్కలుగా కట్ చేసి) – 1 కప్పు
  3. ఇవి కూడా చదవండి
  4. ఉల్లిపాయ – 1 మీడియం సైజు(సన్నగా తరిగినది)
  5. పచ్చిమిర్చి- 2 (సన్నగా తరిగినవి)
  6. వెల్లుల్లి రెబ్బలు 3 (సన్నగా కట్ చేయాలి)
  7. కాప్సికమ్ – ½ కప్పు(సన్నగా తరిగినది)
  8. క్యారెట్- ½ కప్పు (తరిగినది)
  9. సోయా సాస్ – టేబుల్ స్పూన్లు
  10. ఉప్పు – రుచికి సరిపడా
  11. మిరియాల పొడి – ½ స్పూన్
  12. కొత్తిమీర – అలంకరణ కోసం(తరిగినవి)
  13. నూనె లేదా వెన్న – 2 టేబుల్ స్పూన్లు
  14. జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్ల

తయారు చేసే పద్ధతి:

  1. స్టవ్ వెలిగించి బాణలిని పెట్టి.. నూనె లేదా వెన్న వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఈ నూనెకి వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి తేలికగా వేయించాలి.
  2. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్ వేసి 3 నిమిషాలు వేయించాలి.
  3. తర్వాత ఈ మిశ్రమంలో పైనాపిల్ ముక్కలు వేసి 2 నిమిషాలు ఉడికించాలి. తద్వారా వాటి రుచి మరియు తీపి బియ్యంలో బాగా కరిగిపోతాయి.
  4. ఇలా రెడీ అయిన అనాస మిశ్రమంలో ఉడికించిన అన్నం, తీసుకున్న మసాలా దినుసులు, సోయా సాస్, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
  5. అన్నానికి మసాలా దినుసులు, ఫినాపిల్ రుచి కలిసేలా కలిపి.. బాణలిపై మూత పెట్టి.. స్విమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
  6. ఈ మిశ్రమం మీద కొత్తిమీర, జీడిపప్పుతో అలంకరించండి. అంతే రుచికరమైన థాయి స్పెషల్ పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీనిని వేడి వేడిగా వడ్డించండి పిల్లలు, పెద్దలు ఇష్టంగా మెతుకు కూడా మిగల్చకుండా తింటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

భార్యతో కనిపిపించిన ఫ్రెండ్.. ఆ తర్వాత జరిగిందిదే..
భార్యతో కనిపిపించిన ఫ్రెండ్.. ఆ తర్వాత జరిగిందిదే..
పీఎం కిసాన్ డబ్బు రెట్టింపు అవుతుందా? పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చ
పీఎం కిసాన్ డబ్బు రెట్టింపు అవుతుందా? పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చ
ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే ఈజీగా..
ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే ఈజీగా..
ఈ 5 కూరగాయలను ఉడికించి కాదు.. పచ్చిగా తింటేనే ఎక్కవ ప్రయోజనాలట
ఈ 5 కూరగాయలను ఉడికించి కాదు.. పచ్చిగా తింటేనే ఎక్కవ ప్రయోజనాలట
ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్‌ను చూడటమే నా కల..
ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్‌ను చూడటమే నా కల..
200కి.మీ. పొడవైన భూగర్భ గ్రామం! 20ఏళ్లుగా అక్కడే ఉంటున్న వందలమంది
200కి.మీ. పొడవైన భూగర్భ గ్రామం! 20ఏళ్లుగా అక్కడే ఉంటున్న వందలమంది
ఇదేందిరా సామి బంగారం ధర ఇంత తగ్గిందా..? వెండిపై భారీ తగ్గింపు!
ఇదేందిరా సామి బంగారం ధర ఇంత తగ్గిందా..? వెండిపై భారీ తగ్గింపు!
వెంకీతో ఛాన్స్.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన హీరోయిన్లు వీరే..
వెంకీతో ఛాన్స్.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన హీరోయిన్లు వీరే..
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త కన్నీళ్లు.. చివరకు ఊహించని..
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త కన్నీళ్లు.. చివరకు ఊహించని..
మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్