AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: వెంకటేశ్‏తో బ్లాక్ బస్టర్ హిట్ ఛాన్స్ మిస్ చేసుకున్న 5గురు హీరోయిన్లు.. చివరకు..

విక్టరీ వెంకటేశ్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. నిర్మాత రామానాయుడు వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, యాక్షన్ డ్రామాలతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఈరోజు (డిసెంబర్ 13న) వెంకీ పుట్టినరోజు.

Venkatesh: వెంకటేశ్‏తో బ్లాక్ బస్టర్ హిట్ ఛాన్స్ మిస్ చేసుకున్న 5గురు హీరోయిన్లు.. చివరకు..
Rajitha Chanti
|

Updated on: Dec 13, 2025 | 10:24 AM

Share

తెలుగు సినిమా ప్రపంచంలో టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు విక్టరీ వెంకటేశ్, యాక్షన్ డ్రామా, సస్పెన్స్ త్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, ప్రేమకథ ఇలా ఎలాంటి జానర్ చిత్రాలైనా సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈరోజు (డిసెంబర్ 13న) వెంకీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే వెంకీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రేమించుకుందాం రా సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ప్రేమించుకుందాం రా సినిమా తర్వాత డైరెక్టర్ జయంతి సి. పరాన్జీ దర్శకత్వంలో వెంకీ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేశారట. ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసిన తర్వాత హీరోయిన్ పాత్ర కోసం 5గురిని సంప్రదించారట. కానీ ఎవరు వర్కౌట్ కాలేదట.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..

చివరకు బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా వెంకటేశ్ సరసన నటించి తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా.. మనం ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామో. అవును.. ఆ మూవీ పేరు ప్రేమంటే ఇదేరా. ఈ సినిమా కోసం ముందుగా ఐశ్వర్య రాయ్ ను అనుకున్నారట. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయారట. ఆ తర్వాత భూమిక, రీమా సేన్ లను సంప్రదించగా.. అనుకోకుండా వారిద్దరూ ఈ ప్రాజెక్టులో భాగం కాలేకపోయారు.

ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..

అదే సమయంలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓ వాణిజ్య ప్రకటనలో కనిపించిన ప్రీతి జింటా గురించి డైరెక్టర్ జయంత్ సి. పరాన్జీకి చెప్పారట. వెంటనే జయంత్ ముంబై వెళ్లి కథ వినిపించగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతకు ముందే ఆమె దిల్ సే చిత్రంలో నటించినప్పటికీ తెలుగులో మాత్రమే ప్రేమంటే ఇదేరా మూవీతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు అమీషా పటేల్, రేణూ దేశాయ్ పేర్లు కూడా వినిపించాయట. 1998లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‏తో క్రేజ్.. క్యాన్సర్‏తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..

వెంకీతో ఛాన్స్.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన హీరోయిన్లు వీరే..
వెంకీతో ఛాన్స్.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన హీరోయిన్లు వీరే..
ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త..
ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త..
మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్క
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్క
ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు
ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు
ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!
ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!
మెదడుకు మేత.. ఈ ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్తే.. నువ్వే తోపు!
మెదడుకు మేత.. ఈ ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్తే.. నువ్వే తోపు!
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. రజినీ లైఫ్ స్టైల్ చూశారా.. ?
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. రజినీ లైఫ్ స్టైల్ చూశారా.. ?
ఈ వ్యక్తులకు ఎంతదూరం ఉంటే అంత మంచిది.. లేకపోతే జీవితంలో సక్సెస్..
ఈ వ్యక్తులకు ఎంతదూరం ఉంటే అంత మంచిది.. లేకపోతే జీవితంలో సక్సెస్..
హార్దిక్ పాండ్యా, కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం?
హార్దిక్ పాండ్యా, కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం?