రివర్స్ వాకింగ్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముందుకు నడిచే దానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంతోపాటు, ఇది కండరాలను బలోపేతం చేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఏకాగ్రతను పెంచి, జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. రోజుకు కొన్ని నిమిషాలు వెనక్కి నడవడం ద్వారా శారీరక, మానసిక ప్రయోజనాలు పొందవచ్చు.