AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lionel Messi : అర్థరాత్రి నుంచే ఎయిర్‎పోర్టులో పండుగ వాతావరణం..లెజెండ్ రాక కోసం వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్

Lionel Messi : అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల భారత్ పర్యటన సందర్భంగా శనివారం ఉదయం కోల్‌కతా చేరుకున్నారు. దీంతో GOAT ఇండియా టూర్ 2025 అధికారికంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే సిటీ ఆఫ్ జాయ్(కోల్‌కతా) అంతటా తీవ్ర ఉత్సాహం నెలకొంది.

Lionel Messi : అర్థరాత్రి నుంచే ఎయిర్‎పోర్టులో పండుగ వాతావరణం..లెజెండ్ రాక కోసం వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
Lionel Messi (1)
Rakesh
|

Updated on: Dec 13, 2025 | 10:10 AM

Share

Lionel Messi : అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ శనివారం ఉదయం కోల్‌కతా చేరుకున్నారు. దీంతో GOAT ఇండియా టూర్ 2025 అధికారికంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే సిటీ ఆఫ్ జాయ్(కోల్‌కతా) అంతటా తీవ్ర ఉత్సాహం నెలకొంది. మియామీ నుంచి దుబాయ్ మీదుగా ప్రయాణించి వచ్చిన మెస్సీ కోసం, అర్ధరాత్రి కూడా వేలాది మంది అభిమానులు ఎయిర్ పోర్టు చుట్టూ గుమిగూడారు. ప్రపంచ కప్ విజేతను ఒక్కసారి చూడటానికి కంచెలపైకి ఎక్కి, అర్జెంటీనా జెండాలను ఊపుతూ అభిమానులు మెస్సీ.. మెస్సీ అంటూ నినాదాలు చేశారు.

“14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్‌కు రావడం వల్ల చాలా గొప్ప వాతావరణం ఏర్పడింది” అని టూర్ ఆర్గనైజర్ శతద్రు దత్తా తెలిపారు. “భారత ఫుట్‌బాల్‌తో అనుబంధం మళ్లీ పెరుగుతోంది. ఇంతకు ముందెన్నడూ లేనంతగా భారత ఫుట్‌బాల్‌కు స్పాన్సర్‌లు ముందుకు వచ్చారు” అని ఆయన అన్నారు. మెస్సీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వకముందే విమానాశ్రయానికి చేరుకున్న అభిమానులు, ఆ క్షణం తమకు నమ్మశక్యంగా లేదని చెప్పారు. “మేము రెండు గంటల నుంచి ఎదురుచూస్తున్నాం. అవసరమైతే నాలుగు గంటలు కూడా వేచి చూస్తాం. జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోలేం” అని ఒక అభిమాని మీడియాతో అన్నారు. మరొక అభిమాని ఈ రాత్రిని నిజంగా మ్యాజిక్ అని అభివర్ణించారు.

కోల్‌కతాలో నేటి కార్యక్రమాలు

మెస్సీ మూడు రోజుల పర్యటనలో కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూ ఢిల్లీ నగరాలను సందర్శించనున్నారు. కోల్‌కతాలో మెస్సీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది:

మీట్-అండ్-గ్రీట్ (9:30 – 10:30 AM): ఉదయం 9:30 నుంచి 10:30 వరకు సెలక్ట్ చేసిన అతిథులు, నిర్వాహకుల కోసం ఒక ప్రైవేట్ మీట్-అండ్-గ్రీట్ ఉంటుంది.

వర్చువల్ విగ్రహావిష్కరణ: ఆ తర్వాత, నగర ప్రజల ప్రేమకు గుర్తుగా, శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్‌లో తన పేరిట ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించడానికి ఆన్‌లైన్‌లోకి మారనున్నారు.

అభిమానులందరికీ అత్యంత ముఖ్యమైన ఈవెంట్ మధ్యాహ్నం ఉంటుంది. మెస్సీ యువ భారతి స్టేడియంలో జరిగే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. ఈ మ్యాచ్ చూడటానికి వేలాది మంది అభిమానులు హాజరవుతారని అంచనా. అదే వేదికలో జరిగే ఫ్యాన్ ఇంటరాక్షన్ కార్యక్రమంతో కోల్‌కతాలో మెస్సీ పర్యటన ముగుస్తుంది.

ఈ ఈవెంట్‌లకు ప్రవేశం డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా లభించింది. టిక్కెట్ ధరలు సుమారు రూ.4,500 నుంచి ప్రారంభమయ్యాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, చాలా కేటగిరీల టిక్కెట్లు త్వరగా అమ్ముడయ్యాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..