AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika: పవన్ సార్ సీఎం అవ్వాలన్నదే నా కల.. భారత అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ను చూడటమే నా కల.. ఇలాంటి లీడర్ మన దేశానికి ఉండాలి.. అంటూ భారత అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక పేర్కొన్నారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.

Deepika: పవన్ సార్ సీఎం అవ్వాలన్నదే నా కల.. భారత అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక
Pawan Kalyan Deepika
Shaik Madar Saheb
|

Updated on: Dec 13, 2025 | 10:44 AM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ను చూడటమే నా కల.. ఇలాంటి లీడర్ మన దేశానికి ఉండాలి.. అంటూ భారత అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక పేర్కొన్నారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో పవన్ కల్యాణ్ ఆప్యాయంగా మాట్లాడారు.. ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అభినందించారు. అనంతరం దీపిక వార్తా సంస్థ పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా.. భారత అంధ మహిళల క్రికెట్ జట్టు.. టీ20 ప్రపంచ కప్ విజయం వెనుక ఉన్న ప్రయాణం గురించి కెప్టెన్ దీపిక వివరించారు. కర్ణాటక – ఆంధ్రప్రదేశ్ నుండి తనకు లభించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక-ఆంధ్ర సరిహద్దులోని సత్యసాయి జిల్లా, తంబలహట్టి గ్రామానికి చెందిన దీపిక, జట్టుకు తన ఎంపిక కర్ణాటక ద్వారా జరిగిందని, ఒక క్రికెటర్‌గా తన ఎదుగుదలలో ఈ రెండు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు. “ఆ మద్దతుతోనే మేము ప్రపంచకప్ గెలవగలిగాము, భారతదేశానికి, మా గ్రామానికి, మా రాష్ట్రానికి గుర్తింపు తీసుకురాగలిగాము” అని ఆమె అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలవడం చాలా సంతోషకరమని.. ఆయనతో మాట్లాడటం.. తన నాన్నతో మాట్లాడినట్లే ఉందని దీపిక చెప్పుకొచ్చారు..

దీపిక వీడియో..

ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ అయిన పవన్ కల్యాణ్.. ఒక్కో క్రికెటర్ కీ రూ.5 లక్షల చొప్పున చెక్ ప్రదానం చేశారు. శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున చెక్కులు అందించారు. ప్రతి మహిళ క్రికెటర్ కీ పట్టు చీర, శాలువాతోపాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు.. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ క్రీడాకారీణులు దీపిక (జట్టు కెప్టన్), పాంగి కరుణా కుమారి ఉండటం సంతోషంగా ఉందన్నారు.

దీపిక గ్రామ సమస్యలు పరిష్కరించండి..

ఈ సందర్భంగా జట్టు కెప్టన్ దీపిక తమ గ్రామ సమస్యలు తెలిపారు. దీపిక శ్రీ సత్యసాయి జిల్లా హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందినది.. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన క్రికెటర్ కరుణకుమారికి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..