Andhra Pradesh: ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే ఈజీగా రేషన్ కార్డు..
ఏపీ ప్రభుత్వం పేదల కోసం రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త కార్డులు, సభ్యుల పేర్ల నమోదు, చిరునామా మార్పు సేవలను నిరంతరంగా అందిస్తోంది. డిజిటల్ సహాయకులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. వివాహిత జంటలు, పిల్లల పేర్లు చేర్చడానికి అవసరమైన పత్రాలు, సమయపాలన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ ప్రయోజనాలను అందించడంలో కీలకమైన రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను ఏపీ ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. గతంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం కష్టంగా ఉండేది. అయితే ప్రభుత్వం ఈ ప్రక్రియను నిరంతర ప్రక్రియగా మార్చడంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సులభంగా సేవలు పొందేందుకు వీలు కల్పించింది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు, మార్పుల కోసం ప్రత్యేకంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని డిజిటల్ సహాయకులకు అప్పగించారు.
కొత్తగా పెళ్లైన జంటలకు రేషన్ కార్డు కాగా పెళ్లైన జంటలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పుడు పెద్ద తతంగం లేదు. కొన్న డాక్యుమెంట్స్ ఉంటేనే సరిపోతుంది. భార్యాభర్తల ఆధార్ కార్డు వివరాలు, భర్త పాత రేషన్ కార్డు, వివాహ ధ్రువీకరణ పత్రం ఉంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ తీసుకుని సమీపంలోని సచివాలయానికి వెళ్లి డిజిటల్ సహాయకులను సంప్రదించాలి. వారు వెబ్‌సైట్‌లో మ్యారేజీ స్ల్పిట్ ఆప్షన్ కింద వివరాలు నమోదు చేస్తారు. నమోదు తర్వాత ఈకేవైసీ పూర్తి చేసి, స్థానిక వీఆర్వో, తహసీల్దారు పరిశీలన అనంతరం కొత్త కార్డు మంజూరు చేస్తారు. రేషన్ కార్డులో పిల్లల పేర్ల నమోదు పిల్లల పేర్లు నమోదు చేయడం కూడా చాలా సులభమైంది. పిల్లల ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల రేషన్ కార్డు వివరాలతో సచివాలయంలోని డిజిటల్ సహాయకులను సంప్రదించాలి. వీఆర్వో, తహసీల్దారు అనుమతి రాగానే రేషన్ కార్డులో కొత్త పేర్లు చేరుస్తారు.
చిరునామా మార్పు, ఇతర సేవలు కొత్త కార్డులు, పేర్ల నమోదుతో పాటు రేషన్ కార్డులలో చిరునామా మార్పునకు కూడా ప్రభుత్వం సచివాలయాల ద్వారా అవకాశం కల్పించింది. ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణను నిరంతరం చేసినప్పటికీ కార్డులు జారీ చేయడానికి సమయపాలన నిర్ణయించింది. జనవరి – జూన్ మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి జులై నెలలో కొత్త బియ్యం కార్డులు అందిస్తారు. జులై – డిసెంబర్ మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








