AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త కన్నీళ్లు.. చివరకు ఊహించని మలుపు..

కర్ణాటకలో సంచలనం సృష్టించిన మంజు - లీల - సంతు ప్రేమకథ అనూహ్య మలుపు తిరిగింది. ప్రియుడు సంతు కోసం భర్త మంజు, ముగ్గురు పిల్లలను వదిలి వెళ్లిన లీల.. చివరకు తన మనసు మార్చుకుంది. ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త కన్నీళ్లు.. చివరకు ఊహించని మలుపు..
Leela Returns To Husband Manjunath
Krishna S
|

Updated on: Dec 13, 2025 | 10:31 AM

Share

ఈ మధ్యకాలంలో భార్యలు భర్తలను చంపడం ఆందోళన కలిగిస్తుంది. ప్రియుడి కోసం పిల్లలను, భర్తను వదిలేసి పోతున్న ఘటనలు బాగా పెరిగాయి. ఇటువంటి తరుణంలో ప్రియుడి కోసం ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్.. చివరకు మనసు మార్చుకుని తిరిగి భర్త మంజునాథ్ చెంతకు చేరింది. కర్ణాటక బన్నేరుఘట్ట సమీపంలోని బసవనపురలో సంచలనం సృష్టించిన మంజు-లీల-సంతు ట్రయాంగిల్ ప్రేమకథ ఊహించని మలుపు తిరిగింది. కొన్ని నెలల క్రితం భర్త మంజు, ముగ్గురు పిల్లలను వదిలేసి లీల, తన ప్రియుడు సంతుతో వదిలి వెళ్లిపోయింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. భార్య దూరమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మంజు, మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. పిల్లల కోసమైన తిరిగి ఇంటికి రావాలని భార్యను వేడు బహిరంగంగా వేడుకున్నాడు. అయినప్పటికీ లీల మాత్రం సంతుతో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది.

మధ్యలో  జైలు శిక్ష

లీల తన ప్రేమికుడు సంతు ఇంట్లో ఉండడంపై మంజు చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశాడు. కోపంతో వారిపై దాడి చేయడంతో మంజు జైలు పాలయ్యాడు. ఈ సమయంలో లీల తన ప్రియుడు సంతు, వారి ముగ్గురు పిల్లలతోనే కలిసి ఉంది. జైలు నుంచి విడుదలైన తర్వాత మంజు బసవనపురలోని తన పాత ఇంటిని ఖాళీ చేసి, జల్లి మిషన్ ప్రాంతంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. భార్య, పిల్లలతో విడిపోవడంతో బాధపడిన మంజు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా తన బాధను, భావోద్వేగాలను పంచుకున్నాడు.

కొత్తగా ఆటో కొనుక్కుని, తన మొదటి కొడుకుతో కలిసి జీవిస్తున్న మంజు.. ఇటీవల ఒక వీడియోలో లీల, సంతుపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. లీల-సంతు తమ పిల్లలను పాఠశాలకు పంపడం లేదని ఆరోపిస్తూ, పిల్లలను తనకు అప్పగించాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశాడు. మంజు చేసిన ఆరోపణలు, విజ్ఞప్తుల అనంతరం ఈ పరిస్థితి అనూహ్యంగా మలుపు తిరిగింది. చాలా నెలల పాటు జరిగిన విభేదాలు, బాధ, కలహాల తర్వాత, లీల తన ముగ్గురు పిల్లలతో సహా మంజు ఇంటికి తిరిగి వచ్చింది. ఈ పరిణామంతో వారి ట్రయాంగిల్ స్టోరీ సుఖాంతమైంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..