Tamarind Leaves Benefits: చింత చిగురు ప్రకృతి మనిషికి ప్రసాదించిన అద్భుత ఔషధం. దీనిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కండరాల, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం అందిస్తుంది.