Rajinikanth: 75 ఏళ్ల వయసులో తగ్గని ఎనర్జీ.. రజినీకాంత్ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా.. ?
భారతీయ సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. సాధారణ బస్ కండక్టర్ నుంచి సినీరంగంలో స్టార్ హీరో వరకు ఎదిగిన ప్రయాణం అంత సులభమేమి కాదు. డిసెంబర్ 12న రజినీ బర్త్ డే కావడంతో ఆయన గురించి తెలుసుకోవడానికి తెగ ట్రై చేశారు నెటిజన్స్.

సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సాధారణ బస్ కండక్టర్ నుంచి టాప్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. రజినీకాంత్.. అసలు పేరు శివాజీ రావు 1950 డిసెంబర్ 12న కర్ణాటకలో రామోజీ రావు, రమా భాయ్ దంపతుల నాల్గవ కుమారుడిగా జన్మించారు. బెంగళూరులో చదువుకున్న శివాజీ రావు చదువుపై దృష్టి పెట్టకుండా నటనపై దృష్టి పెట్టారు. చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడే బస్ కండక్టర్‌గా పనిచేశారు, నాటకాల్లో కూడా నటించారు. 1975లో కన్నడ చిత్రం కథ సంగమలో ఆయన అరంగేట్రం చేశారు. అదే సంవత్సరం, కె బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగల్ చిత్రంలో కూడా ఆయన ఒక చిన్న పాత్ర పోషించారు.
తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన రజినీ.. ఇప్పటివరకు వరుస సినిమాలతో మెప్పిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 170కి పైగా సినిమాల్లో నటించారు. నివేదికల ప్రకారం రజినీ ఒక్కో సినిమాకు రూ.120 కోట్లకు పైగా వసూలు చేస్తున్నారు. ఆయన ఆస్తులు విలువ దాదాపు రూ.430 కోట్లు ఉంటుందని టాక్. దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా దూసుకుపోతున్నారు రజినీ. గత సంవత్సరం విడుదలైన యాక్షన్ డ్రామా అయిన వెట్టయన్ కోసం రూ.125 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఆయనకు చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో ఒక విలాసవంతమైన ఇంటిని కలిగి ఉన్నాడు. ఆ ఇంటి విలువ రూ.35 కోట్లు.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..
ఇదివరకే రూ.6 కోట్ల విలువైన రూల్స్ రాయిస్ ఘోస్ట్, రూ.16.5కోట్ల విలువైన రూల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. రజనీకాంత్ లగ్జరీ కార్ల కలెక్షన్‌లో ₹ 1.77 కోట్ల విలువైన BMW X5, ₹ 2.55 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ G-వ్యాగన్ ఉన్నాయి . ఆయనకు ₹ 3.10 కోట్ల విలువైన లంబోర్గిని ఉరుస్, రూ. 6 కోట్ల విలువైన బెంట్లీ లూమినస్ కూడా ఉన్నాయి. టయోటా ఇన్నోవా, హోండా సివిక్, ప్రీమియర్ పద్మిని,అంబాసిడర్ కూడా ఉన్నాయి . భారత ప్రభుత్వం రజనీకాంత్‌ను 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2016లో భారతదేశంలో మూడవ, రెండవ అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మవిభూషణ్‌తో సత్కరించింది. 2019లో ఆయనకు సినిమా రంగంలో అత్యున్నత భారతీయ పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ప్రపంచ సినిమాకు ఆయన చేసిన కృషికి గాను ఐఎఫ్ఎఫ్ఐ సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారం కూడా లభించాయి.
ఇవి కూడా చదవండి : Tollywood : అవకాశం ఇస్తానని ఇంటికొచ్చి మరీ అలా ప్రవర్తించాడు.. గుప్పెడంత మనసు సీరియల్ నటి..




