AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venky Mama@65: విక్టరీకి కేరాఫ్.. యువ హీరోలకు స్ఫూర్తి.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆరాధ్యుడు!

తెలుగు సినీ పరిశ్రమలో మల్టీస్టారర్‌ సినిమాలకు కొత్త ట్రెండ్‌ను పరిచయం చేసి, ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించే నటుడు విక్టరీ వెంకటేష్. ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా కనిపించే వెంకీ మామ... నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ఆయన కెరీర్ కేవలం విజయాలకే ..

Venky Mama@65: విక్టరీకి కేరాఫ్.. యువ హీరోలకు స్ఫూర్తి.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆరాధ్యుడు!
Venkatesh Victory
Nikhil
|

Updated on: Dec 13, 2025 | 8:00 AM

Share

తెలుగు సినీ పరిశ్రమలో మల్టీస్టారర్‌ సినిమాలకు కొత్త ట్రెండ్‌ను పరిచయం చేసి, ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించే నటుడు విక్టరీ వెంకటేష్. ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా కనిపించే వెంకీ మామ… నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ఆయన కెరీర్ కేవలం విజయాలకే పరిమితం కాలేదు, ఆయన వ్యక్తిత్వం, నిరాడంబరత, నటనలో వైవిధ్యం.. ఇవన్నీ ఆయనను ప్రేక్షకులకు మరింత ఆత్మీయుడిని చేశాయి. నేడు (డిసెంబర్ 13) విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన సినీ ప్రస్థానం, సాధించిన ‘విక్టరీ’ల గురించి తెలుసుకుందాం.

వైవిధ్యానికి మారుపేరు..

వెంకటేష్ కెరీర్ మొదలైనప్పటి నుంచి ఆయన ఒక్క జానర్‌కే పరిమితం కాకుండా ప్రయోగాలు చేశారు. ఇది ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది.’ప్రేమ’, ‘సుందరకాండ’, ‘చంటి’, ‘పవిత్ర బంధం’, ‘సూర్యవంశం’ వంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు ‘ఫ్యామిలీ హీరో’గా స్థిరపడ్డారు. ముఖ్యంగా, ‘ప్రేమ’ సినిమా వచ్చిన ‘విక్టరీ’ టైటిల్ ఆయన పేరుకు శాశ్వతంగా చేరిపోయింది.

‘బొబ్బిలి రాజా’, ‘ఘర్షణ’, ‘గురు’, ‘దృశ్యం’ వంటి సినిమాలతో యాక్షన్, మాస్ ప్రేక్షకులను కూడా అలరించారు. ప్రతీ పాత్రలో కొత్తదనం చూపించడానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తారు. ‘కలిసుందాం రా’, ‘జెమినీ’, ‘వసంతం’ వంటి సినిమాల్లో భావోద్వేగాలను పలికించిన తీరు… ఆయన నటనలోని లోతును తెలియజేస్తుంది. ఎలాంటి పాత్రనైనా తన మార్కు నటనతో వెంకీ దాన్ని సులువుగా పండించగలరు.

Venky And Mahesh

Venky And Mahesh

మల్టీస్టారర్స్‌కు కేరాఫ్..

వెంకటేష్ సినీ ప్రస్థానంలో మరో ముఖ్యమైన నిర్ణయం మల్టీస్టారర్ చిత్రాలు. కొత్త తరానికి చెందిన హీరోలతో కలిసి నటించడానికి ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (SVSC)..మహేష్ బాబుతో కలిసి నటించిన ఈ సినిమా తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్‌ను పరిచయం చేసింది. అన్నదమ్ముల అనుబంధాన్ని అద్భుతంగా చూపించింది. ‘గోపాల గోపాల’, ‘ఎఫ్2’, ‘వెంకీ మామ’.. పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, నాగ చైతన్య వంటి యువ హీరోలతో కలిసి నటించి, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. యువ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా, మరింత ఉల్లాసంగా నటించే ఆయన పద్ధతి వల్లే ప్రేక్షకులు ఆయన్ని ముద్దుగా ‘వెంకీ మామ’ అని పిలుచుకుంటారు.

Venky And Pawan

Venky And Pawan

తెరవెనుక..

తెరపై ఎంత బిజీగా ఉన్నా, తెరవెనుక వెంకటేష్ జీవితం ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు ప్రతీక. ఆయన నిరాడంబరత, వినయంతో కూడిన వ్యక్తిత్వం ఇండస్ట్రీలో అందరికీ ఆదర్శం. తరచుగా ధ్యానం, యోగా వంటి వాటిని అభ్యసిస్తూ, జీవితంలో సంతృప్తిని, ఆనందాన్ని వెతుక్కునే ఆయన మార్గం అందరికీ స్ఫూర్తిదాయకం. అందుకే, ఆయన ‘విక్టరీ’ కేవలం సినిమాల విజయాలకు మాత్రమే కాదు, జీవితాన్ని ప్రశాంతంగా గెలవడానికి కూడా చెందుతుంది. మరిన్ని విజయాలు, ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని విక్టరీ వెంకటేష్​కి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం!

Venky N Ram

Venky N Ram

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.830 కోట్లు విడుదల చేసిన..
విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.830 కోట్లు విడుదల చేసిన..
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నలుగురు క్రికెటర్లు సస్పెండ్
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నలుగురు క్రికెటర్లు సస్పెండ్
తెరపై నవరసాలు.. తెరవెనుక ఆధ్యాత్మికత! వెంకీ మామ స్పెషల్!
తెరపై నవరసాలు.. తెరవెనుక ఆధ్యాత్మికత! వెంకీ మామ స్పెషల్!
ఉదయాన్నే చెప్పులు లేకుండా ఇలా నడిస్తే...ఆ వ్యాధులన్నింటికీ చెక్
ఉదయాన్నే చెప్పులు లేకుండా ఇలా నడిస్తే...ఆ వ్యాధులన్నింటికీ చెక్
రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ ఎక్స్‌ప్రెస్‌ సమయ వేళల్లో మార్పు
రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ ఎక్స్‌ప్రెస్‌ సమయ వేళల్లో మార్పు
మెస్సీతో ఫోటో.. రూ.10 లక్షలు మాత్రమే
మెస్సీతో ఫోటో.. రూ.10 లక్షలు మాత్రమే
హాలీవుడ్ సినిమాలో టాలీవుడ్ హ్యాండ్సమ్ విలన్.. ఎవరో గుర్తుపట్టారా?
హాలీవుడ్ సినిమాలో టాలీవుడ్ హ్యాండ్సమ్ విలన్.. ఎవరో గుర్తుపట్టారా?
కండోమ్ లేకుండా శృంగారంతో జైలుకు.. ఆ 'ఆటగాడు' ఎవరంటే?
కండోమ్ లేకుండా శృంగారంతో జైలుకు.. ఆ 'ఆటగాడు' ఎవరంటే?
అర్ధరాత్రి ఆకలి అవుతుందా.. మీరు చేసే ఈ తప్పులే కారణమని తెలుసా..?
అర్ధరాత్రి ఆకలి అవుతుందా.. మీరు చేసే ఈ తప్పులే కారణమని తెలుసా..?
హైదరాబాద్‌కి మెస్సీ ఫీవర్‌.. ఫొటో దిగాలంటే రూ. 10 లక్షల టికెట్‌..
హైదరాబాద్‌కి మెస్సీ ఫీవర్‌.. ఫొటో దిగాలంటే రూ. 10 లక్షల టికెట్‌..