తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన చలి గుప్పిట్లో చిక్కుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని గిన్నెధరి, కెరమేరి, తిర్యాణి ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లోనూ చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు.