AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీటిని తింటే మీ లివర్ షెడ్డుకెళ్లినట్టే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..

Healthy Liver Tips: శరీరంలోని అన్ని అవయవాలు కూడా మనం ఆరోగ్యంగా ఉండేందుకు కీలక పోషిస్తాయి. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకునేందుకు.. మంచి ఆహారం, జీవనశైలిని అవలంభించడం ముఖ్యం.. అలాంటి ముఖ్యమైన అవయవాల్లో అతిపెద్ద అవయవం కాలేయం (లివర్).. ఇది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

వీటిని తింటే మీ లివర్ షెడ్డుకెళ్లినట్టే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..
Liver Health
Shaik Madar Saheb
|

Updated on: Dec 13, 2025 | 9:26 AM

Share

Healthy Liver Tips: శరీరంలోని అన్ని అవయవాలు కూడా మనం ఆరోగ్యంగా ఉండేందుకు కీలక పోషిస్తాయి. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకునేందుకు.. మంచి ఆహారం, జీవనశైలిని అవలంభించడం ముఖ్యం.. అలాంటి ముఖ్యమైన అవయవాల్లో అతిపెద్ద అవయవం కాలేయం (లివర్).. ఇది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. జీర్ణక్రియ, నిర్విషీకరణ, పోషకాలను ప్రాసెస్ చేయడం, ప్రోటీన్ల ఉత్పత్తి, ఇన్ఫెక్షన్లతో పోరాడటం వంటి అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. అయితే.. మనం తీసుకునే.. అనారోగ్యకరమైన ఆహారం వల్ల కాలేయంలో టాక్సిన్స్ నిండిపోతాయి. దీంతో శరీరంలో జీవక్రియ ప్రక్రియ ప్రభావితమవుతుంది. ఫలితంగా శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి.

అలాంటి పరిస్థితిలో అలాంటి కొన్ని అనారోగ్యకరమైన ఆహారాలను నివారించడం చాలా ముఖ్యం.. దీని ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలేంటి.. ఎలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

మద్యం: శీతాకాలంలో చాలా మంది మద్యం తాగుతారు. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఆల్కహాల్.. లివర్ వాపు, సెల్ డెత్, ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది. అదే సమయంలో తీవ్రంగా దెబ్బతింటే.. లివర్ సిర్రోసిస్ కూడా సంభవించవచ్చు.

చక్కెర: చక్కెరను అధికంగా తీసుకోవడం లివర్ తోపాటు.. శరీరానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఊబకాయం పెరుగుతుంది. అదే సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదం పెరగడంతోపాటు.. కాలేయం కూడా దెబ్బతింటుంది. కావున పరిమిత పరిమాణంలో చక్కెరను తినండి.

రెడ్ మీట్: చాలా మంది మాంసం తీసుకుంటారు. వైట్ మీట్ లాంటివి.. చికెన్, చేపలు తీసుకోవడం మంచిది. కానీ రెడ్ మీట్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఎందుకంటే ఇది జీర్ణం కావడం చాలా కష్టం..

నూనె పదార్థాలు – ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్: నూనె పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్‌ను చాలామంది ఇష్టంతో తింటారు. బర్గర్‌, శాండ్‌విచ్‌, పిజ్జా, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ లాంటివి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇవి సులభంగా జీర్ణం కావు.. ఇంకా కాలేయాన్ని దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మైదా పిండి – బేకరీ ఫుడ్ ఐటమ్స్: మైదా పిండిని ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది ఎక్కువగా ప్రాసెస్ అవుతుంది. ఇది ఖనిజాలు, ఫైబర్, ఇతర అవసరమైన పోషకాలను కలిగి ఉండదు.. ఇంకా రసాయనాలతో శుద్ధి చేస్తారు కావున.. శరీరానికి మంచిది కాదని పేర్కొంటున్నారు. బేకరీ ఫుడ్ ఐటమ్స్ లో ఎక్కువగా మైదా కలుస్తుంది కావున ఇవి కూడా మంచివి కావు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పీఎం కిసాన్ డబ్బు రెట్టింపు అవుతుందా? పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చ
పీఎం కిసాన్ డబ్బు రెట్టింపు అవుతుందా? పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చ
ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే ఈజీగా..
ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే ఈజీగా..
ఈ 5 కూరగాయలను ఉడికించి కాదు.. పచ్చిగా తింటేనే ఎక్కవ ప్రయోజనాలట
ఈ 5 కూరగాయలను ఉడికించి కాదు.. పచ్చిగా తింటేనే ఎక్కవ ప్రయోజనాలట
ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్‌ను చూడటమే నా కల..
ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్‌ను చూడటమే నా కల..
200కి.మీ. పొడవైన భూగర్భ గ్రామం! 20ఏళ్లుగా అక్కడే ఉంటున్న వందలమంది
200కి.మీ. పొడవైన భూగర్భ గ్రామం! 20ఏళ్లుగా అక్కడే ఉంటున్న వందలమంది
ఇదేందిరా సామి బంగారం ధర ఇంత తగ్గిందా..? వెండిపై భారీ తగ్గింపు!
ఇదేందిరా సామి బంగారం ధర ఇంత తగ్గిందా..? వెండిపై భారీ తగ్గింపు!
వెంకీతో ఛాన్స్.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన హీరోయిన్లు వీరే..
వెంకీతో ఛాన్స్.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన హీరోయిన్లు వీరే..
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త కన్నీళ్లు.. చివరకు ఊహించని..
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త కన్నీళ్లు.. చివరకు ఊహించని..
మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్క
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్క