AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Services: గుడ్‌న్యూస్‌.. ఇంటి వద్దే ఆధార్‌ సేవలు పొందడం ఎలా? ఇలా దరఖాస్తు చేసుకోండి!

Aadhaar Services: ఇలాంటి వారు ఆధార్‌ సెంటర్‌కు వెళ్లలేని వారు ఇంటి వద్దే ఆధార్‌ సేవలు పొందవచ్చు. మరి దరఖాస్తు ఎలా చేసుకోవాలో చూద్దాం.. ముందుగా కుటుంబ సభ్యులు కొన్ని పత్రాలతో ప్రాంతీయ ఆధార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ సేవలు..

Aadhaar Services: గుడ్‌న్యూస్‌.. ఇంటి వద్దే ఆధార్‌ సేవలు పొందడం ఎలా? ఇలా దరఖాస్తు చేసుకోండి!
Subhash Goud
|

Updated on: Dec 13, 2025 | 9:27 AM

Share

Aadhaar Services: ఈ రోజుల్లో ఆధార్‌ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైనదిగా మారిపోయింది. ప్రభుత్వ పథకం కావాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా.. ప్రతీదానికీ ఆధార్ తప్పనిసరి. కానీ, ఇంటి నుంచి కదలలేని వృద్ధులు, మంచానికే పరిమితమైన అనారోగ్య బాధితులు, దివ్యాంగుల పరిస్థితేంటి? ఆధార్ కేంద్రాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నవారికి భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) శుభవార్త అందిస్తోంది. ఇకపై, సిబ్బందే నేరుగా మీ ఇంటికి వచ్చి, అవసరమైన ఆధార్ సేవలను అందించేలా చర్యలు పడుతోంది. మరి ఆధార్‌ సేవలు ఇంటి వద్దే ఎలా పొందాలు తెలుసుకుందాం..

హయత్‌నగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు మంచానికే పరిమితం కాగా, ఆమె వేలిముద్రలను అప్‌డేట్ చేసేందుకు UIDAI సిబ్బంది నేరుగా ఇంటికే వెళ్లారు. విజయవాడలో మతిస్థిమితం లేని ఓ యువకుడి ఆధార్ అప్‌డేట్‌ కోసం కూడా, సిబ్బంది ఇంటికే వెళ్లి సేవలు అందించారు. ఈ ఘటనలు, UIDAI అందిస్తున్న ఈ ప్రత్యేక సేవ ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ సమయ వేళల్లో మార్పు!

ఇవి కూడా చదవండి

ఇంటి వద్దే ఆధార్‌ సేవలు పొందేందుకు ఎవరు అర్హులు?

ఈ ‘ఇంటి వద్ద ఆధార్’ సేవలు, కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.

  • వృద్ధులు
  • మంచానికే పరిమితమైన వారు
  • తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు
  • దివ్యాంగులు

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఇలాంటి వారు ఆధార్‌ సెంటర్‌కు వెళ్లలేని వారు ఇంటి వద్దే ఆధార్‌ సేవలు పొందవచ్చు. మరి దరఖాస్తు ఎలా చేసుకోవాలో చూద్దాం.. ముందుగా కుటుంబ సభ్యులు కొన్ని పత్రాలతో ప్రాంతీయ ఆధార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ సేవలు అవసరమైన వ్యక్తి ప్రస్తుత పరిస్థితి, వయసు, సేవ ప్రాముఖ్యతను వివరిస్తూ ఓ లేఖ రాయాల్సి ఉంటుంది. వ్యక్తి పరిస్థితిని తెలియజేసేలా ఓ ఫోటోను జతచేయాలి. వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్‌ను జతపరచాలి. వ్యక్తికి సంబంధించిన మరో గుర్తింపు కార్డు జిరాక్స్‌ను కూడా అందించాలి.

ఇది కూడా చదవండి: Gold Price Today: ఇంకా ఎంత పెరుగుతుందో..? తులంపై రూ.3 వేలకుపైగా పెరిగిన బంగారం ధర

ఈ డాక్యుమెంట్స్‌ అన్ని కూడా సమర్పించిన తర్వాత UIDAI సిబ్బంది వాటిని సుమారు 7 రోజుల్లో పరిశీలించి, నేరుగా మీ ఇంటికే వచ్చి అవసరమైన ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ సేవకు దూరంతో సంబంధం లేదు. అయితే ఇంటి వద్దే సేవలు అందించినందుకు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు రూ.700 వరకు తీసుకుంటారు.

మైత్రి వనంలో ప్రాంతీయ కేంద్రం:

ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్, అమీర్‌పేటలోని మైత్రీవనంలో ఉన్న UIDAI ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి