Gold Price Today: ఇంకా ఎంత పెరుగుతుందో..? తులంపై రూ.3 వేలకుపైగా పెరిగిన బంగారం ధర
Gold, Silver Price Today: బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో సహా అనేక కారణాల వల్ల బులియన్ ధరలు పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా..

Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. ధరలను చూస్తుంటే ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తున్నాయి. రానున్న రోజులలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నిన్న ఒక్క రోజే 800 రూపాయలకుపైగా పెరిగింది. గత రెండు, మూడు రోజులుగా ధరలను చూస్తే.. దాదాపు రూ.3 వేలకుపైగానే పెరిగింది. ఇక వెండి విషయానికొస్తే.. ఇది కూడా భారీ స్థాయిలో పరుగులు పెడుతోంది. గత ఆదివారం అంటే డిసెంబర్ 7వ తేదీన కిలో వెండి ధర లక్షా 90వేల రూపాయలు ఉంది.
కానీ ఇప్పుడు రూ.2లక్షల 4100 వద్ద కొనసాగుతోంది. అంటే వారం రోజుల్లోనే దాదాపు 14 వేలకుపైగా పెరిగింది. దీన్ని బట్టి చూస్తే సిల్వర్ ఎంత పరుగులు పెడుతుందో అర్థమైపోతుంది. బంగారం కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతోంది. ఇక డిసెంబర్ 12న ఉదయం 6 గంటల సమయానికి ధరలను చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,210 ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,110 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
ఢిల్లీ:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,210
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,260
ముంబై:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,210
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,110
హైదరాబాద్:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,210
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,110
విజయవాడ:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,210
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,110
బెంగళూరు:
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,210 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,110
చెన్నై:
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,960
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,710
ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




